Home » సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్న వధువు ఎవరో తెలుసా ? అందరికి తెలిసిన ఆ బుల్లి తెర నటి !

సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్న వధువు ఎవరో తెలుసా ? అందరికి తెలిసిన ఆ బుల్లి తెర నటి !

by Anji
Published: Last Updated on
Ad

బుల్లితెర సూప‌ర్ స్టార్ సుధీర్ పెళ్లి ఎప్పుడు అనేది ఎవ‌రు గ్రీన్ హాట్ టాఫిక్‌. థ‌ర్టీ ప్ల‌స్‌లో ఉన్న సుధీర్‌కు పెళ్లీడు ఎప్పుడో దాటిపోయింది. ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్స్ గెట‌ప్ శ్రీ‌ను, రామ్‌ప్ర‌సాద్‌లు పెళ్లిళ్లు చేసుకుని పిల్ల‌ల‌ను కూడా క‌న్నారు. సుధీర్ మాత్రం అలాగే ఉండిపోయారు. బుల్లితెర‌పై ఆయ‌న‌ది ప్లే బాయ్ ఇమేజ్‌. కామెడీ స్కిట్స్‌లో ఆయ‌న క్యారెక్ట‌ర్ అమ్మాయిల వెంట‌ప‌డే జులాయిగా ఉంటుంది. ముఖ్యంగా హాస్యం కోసం త‌న‌ను తాను త‌గ్గించుకుంటూ పంచ్‌లు వేయించుకుంటుంటాడు. ఆ త‌ర‌హా కామెడీ ప్రేక్ష‌కుల‌కు కూఆ ఎంజాయ్ చేయ‌డంతో ఆయ‌న కొన‌సాగిస్తున్నారు.

Advertisement

మరోవైపు సుధీర్‌కు యాంక‌ర్ ర‌ష్మీ తో ఎఫైర్ ఉంద‌నే ప్ర‌చారం చాలా కాలం నుంచే న‌డుస్తుంది. ఈ జంట‌కు భలే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవ‌డం కోసం స్పెష‌ల్ ఈవెంట్స్ ల‌లో ర‌ష్మీ, సుధీర్ ల‌కు పెళ్లి చేసారు. ప‌లుమార్లు ర‌ష్మీ, సుధీర్ ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. రియ‌ల్ లైఫ్‌లో వారిద్ద‌రూ ఏమిట‌నేది ఎప్ప‌టికీ స‌స్పెన్స్‌. వీరిద్ద‌రూ ఏదో ఒక రోజు పెళ్లి వార్త ప్ర‌క‌టిస్తారేమోననే సందేహాలున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఫైన‌ల్‌గా సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ప‌రిచ‌యం చేశారు.

Advertisement


శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షో వేదిక‌గా ఇది జ‌రిగింది. ఆదివారం ప్ర‌సారం కానున్న శ్రీ‌దేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుద‌ల‌వ్వ‌గా.. అత్యంత ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్క‌ర్ తండ్రికి మ‌ళ్లీ పెళ్లి చేయ‌బోతున్న‌ట్టు చూపించారు. ఆయ‌న‌తో పాటు క‌మెడీయ‌న్ల తండ్రులు దీనికి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎపీసోడ్ అద్యంతం సంద‌డిగా సాగింది. కొన్ని ఎమోష‌న్ సీన్లు కూడా చూపించారు. చివ‌ర‌లో బుల్లెట్ భాస్క‌ర్ తండ్రి సుధీర్‌తో మీ నాన్న‌తో ఇప్పుడే ఫోన్‌లో మాట్లాడాను. మావాడు టీవీలోనే పెళ్లి చేసుకుంటున్నాడు.


నిజంగా ఎప్పుడు చేసుకుంటాడు. ఇండ‌స్ట్రీ అమ్మాయిని చేసుకుంటాడా..? బ‌య‌ట అమ్మాయిని చేసుకుంటాడా అడిగార‌ని చెప్పాడు. బుల్లెట్ భాస్క‌ర్ తండ్రి అడిగిన వెంట‌నే సుడిగాలి సుధీర్ స్పందించాడు. ఇంత‌మంది ఫాద‌ర్స్ అంద‌రూ అడుగుతున్నారు కాబ‌ట్టి శ్రీ‌దేవి డ్రామా కంపెనీ స్టేజీ మీద చెప్ప‌బోతున్నా.. నేను ఎవ్వ‌రినీ పెళ్లి చేసుకోబోతున్నానంటే అని సిగ్గుప‌డుతూ స్టేజ్ కింద వైపు వెళ్లాడు. ఆ షోలోనే ఆ అమ్మాయి ఉందంటే ప‌రిశ్ర‌మ‌కు చెందిన అమ్మాయే కావ‌చ్చ‌ని కొంద‌రూ అంచ‌నా వేశారు.

వ‌చ్చేవారం శ్రీ‌దేవి డ్రామా కంపెనీ ఎపీసోడ్‌తో దీనిపై ఓ క్లారిటీ రానున్న‌ది. ఇక బుల్లితెర క‌మెడియ‌న్ యాంక‌ర్‌గా పుల్ బిజిగా ఉన్న సుధీర్ హీరోగా సినిమాలు కూడా చేస్తున్నారు. సుధీర్ హీరోగా సాప్ట్‌వేర్ సుధీర్‌.. త్రీ మంకీస్ తెర‌కెక్కాయి. ఈ రెండు చిత్రాలు అనుకున్నంత‌గా విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం గాలోడు, కాలింగ్ స‌హ‌స్రా చిత్రాలు సుధీర్ హీరోగా తెర‌కెక్కుతున్నాయి.

Also Read :  తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీల‌ మోత‌.. కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading