Home » బిగ్‌ బాస్ 6 లో వైల్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సుడిగాలి సుధీర్‌

బిగ్‌ బాస్ 6 లో వైల్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సుడిగాలి సుధీర్‌

by Anji
Ad

బుల్లితెర సూప‌ర్ స్టార్ అంటూ సుడిగాలి సుధీర్‌ని ఆయ‌న అభిమానులు పిలుచుకుంటుంటారు. అది గ‌తం అయిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఎందుకంటే బుల్లి తెర‌పై ఆయ‌న సంద‌డి త‌గ్గిపోయింద‌ని, ఆయ‌న ఇక క‌నిపించ‌డ‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌క ప్ర‌చారం జ‌రిగింది. జ‌బ‌ర్ద‌స్త్‌, శ్రీ‌దేవి డ్రామా కంపెనీ కార్య‌క్ర‌మాల‌ను వ‌దిలి వెళ్లిపోయినా సుడిగాలి సుధీర్‌కి స్టార్ మాటా వారు పెద్ద షాక్ ఇచ్చారు. అక్క‌డ ఓ భారీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తాం అని హామి ఇచ్చి ఆ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకున్నారు. బ‌డ్జెట్ ఎక్క‌వ అవుతుంద‌నే ఉద్దేశంతో తాము ఆ కార్య‌క్ర‌మాన్ని చేయ‌లేమ‌ని చేతులెత్తేయ‌డంతో సుడిగాలి సుధీర్ తిరిగి ఈటీవీలోకి వెళ్ల‌లేక ఏం చేయాలో పాలుపోక ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ట‌.

Advertisement

ఈటీవీ నుంచి సుడిగాలి సుధీర్‌ని స్టార్ మా వారు తీసుకొన్నారు. ఇప్పుడు వాళ్లే ఏదో ఒక దారి చూపించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. బుల్లితెర వ‌ర్గాల ద్వారా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. బిగ్‌బాస్ సీజ‌న్‌-6 5వ వారంలో సుడిగాలి సుధీర్ స‌డ‌న్ గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సుడిగాలి సుధీర్‌కి క‌చ్చితంగా మంచి ఆద‌ర‌ణ ల‌భించే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం హౌస్‌లో ఉన్న ఒక్క కంటెస్టెంట్ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని అందించ‌లేక‌పోతున్నారు. అందుకే ఈ స‌మ‌యంలో సుధీర్ హౌస్‌లోకి వెళ్లితే క‌చ్చితంగా మంచి రేటింగ్ అనేది న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంది. ఆ కార‌ణంగా సుడిగాలి సుధీర్‌కి భారీ పారితోష‌కం ఆఫ‌ర్ చేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read :  తల్లి చివరి కోరిక తీర్చలేకపోయా అని మహేష్ బాబు కుమిలిపోతున్నారా…? ఆ కోరిక ఏంటి..?


సుడిగాలి సుధీర్ ప్ర‌స్తుతం క్వారెంటైన్‌లో ఉన్నాడ‌ట‌. సోమ‌వారం ఎపిసోడ్ లేదా మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్‌లో సుడిగాలి సుధీర్ అడుగు పెట్టే అవ‌కాశం ఉందంటూ స్టార్ మా వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతుంది. ఇప్ప‌టికే బుల్లితెర ద్వారా సూప‌ర్ స్టార్ గా గుర్తింపు ద‌క్కించుకున్న సుడిగాలి సుధీర్ బిగ్‌బాస్ లోకి వెళ్లడంను కొంద‌రు వ్య‌తిరేకిస్తుంటే కొంద‌రు మాత్రం ఏదో ఒక కార్య‌క్ర‌మం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఆనందంగానే ఉందంటూ సుడిగాలి సుధీర్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంటారు. ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఒక‌టి రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుంద‌నేది.

Also Read :  బాహుబ‌లి కోసం “పొన్నియ‌న్ సెల్వ‌న్” నుండి జ‌క్క‌న్న ఆ సీన్ల‌ను కాపీ కొట్టాడా..? అలా ఎలా జ‌రిగింద‌బ్బా..?

Visitors Are Also Reading