Home » మాటీవీలో సుధీర్ ద‌ర్శ‌నం.. మ‌ల్లెమాల‌కు గుడ్‌బై చెప్పిన‌ట్టేనా..?

మాటీవీలో సుధీర్ ద‌ర్శ‌నం.. మ‌ల్లెమాల‌కు గుడ్‌బై చెప్పిన‌ట్టేనా..?

by Anji
Ad

ఈటీవీలో ప్ర‌సారమ‌య్యే బ‌జ‌ర్ద‌స్త్ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. దాదాపు 10 సంవ‌త్స‌రాల కాలం నుంచి ప్ర‌తి ఇంటా న‌వ్వుల‌ను పూయిస్తోంది. ముఖ్యంగా ఆ ఛాన‌ల్‌కే భారీ టీఆర్‌పీ తెచ్చిపెడుతోంది జ‌బ‌ర్ద‌స్త్‌ షో. అయితే ఈ షోలో డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌ల‌కు కొద‌వే లేద‌ని ఎన్నో స్కిట్స్ ద్వారా ప్రూవ్స్ అయింది. ఈ షో ద్వారా చాలా మంది క‌మెడీయ‌న్స్ వెలుగులోకి వ‌చ్చారు.


సుడిగాలి సుధీర్ అయితే బుల్లితెర మ‌న్మ‌థుడిగా మారారు. మ‌ల్లెమాల దాదాపు ఆయ‌న‌తోనే షోలు చేస్తోంది. బుల్లితెర‌పై సుధీర్‌లేని షో హిట్ కాదు. సుధీర్ క‌నిపిస్తే చాలా ఆ షో హిట్ అవుతుంటుందంటారు. కానీ మ‌ధ్య సుధీర్ కొన్ని షోల‌కు దూరంగా ఉంటున్నాఉ. పండుగ‌కు వ‌చ్చే స్పెష‌ల్ ఈవెంట్ల‌లో సైతం సుధీర్ క‌నిపించ‌క‌పోవ‌డం విశేషం. ఢీ షో నుంచి సుధీర్ ను త‌ప్పించారంటూ ప‌లు క‌త‌నాలు వినిపించాయి. సుధీర్ కావాల‌నే ఢీ నుంచి వెళ్లి పోయాడ‌ని మ‌రికొంద‌రూ పేర్కొంటున్నారు.

Advertisement

Advertisement


ముఖ్యంగా ఢీ షో నుంచి సుధీర్ వెళ్లిపోవ‌డం మాత్రం ఆ షోకు పెద్ద దెబ్బ‌నే త‌గిలిన‌ట్టయింది. సుధీర్ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ షోను ఎవ్వ‌రూ చూడ‌డం లేదు. రేటింగ్స్‌లో ఢీ మరి దారుణ‌మైన స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ షో నుంచి సుధీర్ బ‌య‌ట‌కు రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను సుధీర్ ఇంత‌వ‌ర‌కు కూడా బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. మ‌ల్లెమాల సైతం ఈ మ‌ధ్య స్పెష‌ల్ ఈవెంట్ల‌కు సుధీర్‌ను ప‌క్క‌కు పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ ఈటీవీలో మ‌ల్లెమాల చేస్తున్న హోళీ ఈవెంట్ ప్రోమో వ‌చ్చింది. రంగ్‌దే అంటూ వ‌చ్చిన ఈ ఈవెంట్‌లో సుధీర్ క‌నిపించ‌లేదు.


ఎప్ప‌టి లాగానే రాంప్ర‌సాద్‌, ఆది, వర్ష‌లే క‌నిపించారు. సుధీర్ ఎక్క‌డా..? అంటూ అత‌ని అభిమానులు కామెంట్ల‌తో మ‌ల్లెమాల మీద ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసారు. హోళీ ఈవెంట్‌కు స్టార్ మా చానెల్‌లో మాత్రం సుధీర్ క‌నిపించాడు. త‌గ్గేదేలే అంటూ యాంక‌ర్ ర‌వి, ర‌ష్మీ, హోస్ట్ చేస్తున్న ఈ షోలో సుధీర్ క‌నిపించాడు. సుధీర్‌, ర‌ష్మి ఎమోష‌న‌ల్ బాండింగ్‌ను బాగానే ఎలివేట్ చేశారు. ర‌ష్మి కోసం సుధీర్ పాట పాడ‌టం, ర‌ష్మీ దిష్టి చుక్క పెట్టేయ‌డం అన్నీ కూడా బాగున్నాయి. ఈ దెబ్బ‌తో మల్లెమాల చేస్తున్న హోళీ పండుగ ఈవెంట్‌కు టీఆర్పీ రాదు అని అర్థ‌మ‌వుతోంది. తొలిసారిగా స్టార్ మా ఈవెంట్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఈవెంట్ టీఆర్‌పీ రేటింగ్ రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని సుధీర్ అభిమానులు ప‌లు కామెట్లు పోస్ట్ చేస్తున్నారు.

 

 

Visitors Are Also Reading