Home » కొత్త సినిమాను ప్ర‌క‌టించిన హీరో సుధీర్ బాబు

కొత్త సినిమాను ప్ర‌క‌టించిన హీరో సుధీర్ బాబు

by Bunty
Ad

హీరో సుధీర్ బాబు త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. త‌న కేరీర్ లో 15 వ సినిమాకు సోమ‌వారం పూజా చేసి ప్రారంభించాడు. అంతే కాకుండా ఈ సినిమా కు సంబంధించిన ఒక వ‌ర్కింగ్ స్టిల్ ను త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల తో పంచుకున్నాడు. అలాగే తన సినిమా పై అధికారిక ప్ర‌క‌ట‌న చేశాడు. ఆట మొద‌లైంది అనే క్యాప్ష‌న్ ను కూడా జోడించాడు. అయితే ప‌లు సినిమాల తో పాటు అమృతం సీరియ‌ల్ లో హాస్య న‌టుడిగా న‌టించిన హ‌ర్ష వ‌ర్ధ‌న్ ఈ సినిమా కు డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. హ‌ర్ష వ‌ర్ధ‌న్ కు డైరెక్ట‌ర్ గా ఇదే మొద‌టి సినిమా. గ‌తంలో హ‌ర్ష వ‌ర్ధ‌న్ గుండె జారీ గ‌ల్లంత‌యిందే తో పాటు మ‌నం సినిమాల కు స్క్రిప్ట్, డైలాగ్ రైట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు.

Advertisement

Advertisement

అలాగే ఈ సినిమా ను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్, ఎల్ఎలీపీ ప‌తాకం పై నారాయ‌ణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహ‌న్ రావు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు సినిమా మొద‌టి షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల చేస్తున్నారు. అయితే ఈ సినిమా యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ గా రూపొందుతుంది. అలాగే ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు భిన్న మైన పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని తెలుస్తుంది. అలాగే హ‌ర్ష వ‌ర్ధ‌న్ ఒక డిఫ‌రెంట్ క‌థ తో సినిమా తీస్తున్నాడ‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని థీయేట‌ర్ల లో విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తుంది.

read more.. లిప్‌లాక్‌ సీన్ల‌పై కృతి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

Visitors Are Also Reading