Home » కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై సుధీర్ స్పందన ఏంటి..?

కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై సుధీర్ స్పందన ఏంటి..?

by Azhar
Ad

జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో సుడిగాలి సుధీర్, ఆది, రామ్ ప్రసాద్ ఇలా ఎంతో మంచి ఉన్నారు. ఇక అందులో కిరాక్ ఆర్పీ కూడా ఒక్కడు. కానీ ఈయన జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసి చాలా కలం అవుతుంది. ఇప్పుడు అలాంటి మరో కామెడీ షోలో కిరాక్ ఆర్పీ చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కిరాక్ ఆర్పీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ అనేది పెద్ద రచ్చగా మారింది. అందులో కిరాక్ ఆర్పీ జబర్దస్త్ గురించి దాని ప్రొడక్షన్ హౌస్ గురించి ఘోరంగా మాట్లాడాడు. దానిపై విమర్శల వర్షం కురిపించాడు.

Advertisement

అయితే కిరాక్ ఆర్పీ ఇంటర్వ్యూ వచ్చిన అదే ఛానెల్ లో ఆ తర్వాత ఆది, రామ్ ప్రసాద్ వచ్చి కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై స్పందించారు. కిరాక్ ఆర్పీ చేసింది చాలా తప్పు అని పేర్కొన్నారు. వీరే కాకుండా కిరాక్ ఆర్పీని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే అదే ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పీ సుధీర్ గురించి కూడా మాట్లాడాడు. సుధీర్ ను వారు చాలా ఘోరంగా అవమానించి పంపించారు అని పేర్కొన్నాడు. సుధీర్ ను అలా పంపించడం చాలా భాధగా ఉంటుంది అని కిరాక్ ఆర్పీ పేర్కొన్నాడు. ఇక సుధీర్ గురించి కిరాక్ ఆర్పీ మాట్లాడటం పై ఆయన ఫ్యాన్స్ అలాగే జబర్దస్త్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక కిరాక్ ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ ను సుధీర్ కూడా ఆది, రామ్ ప్రసాద్ మాదిరి ఖండించాలని కోరుతున్నారు. నేరుగా అయిన కాకుండా తన సోషల్ మీడియాలోనైనా కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై సుధీర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా సుధీర్ సైలెంట్ గా ఉంటె కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ నిజం అవుతాయి అని అంటున్నారు. కానీ సుధీర్ కు ఇలా ఎటువంటి కాంట్రవర్సీలలో పడటం ఇష్టం లేదు. అందుకే సుధీర్ కిరాక్ ఆర్పీ కామెంట్స్ పై ఏం మాట్లాడటం లేదు అని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

ఇండియాను ఓడించడం పాకిస్థాన్ కు కష్టమే…!

కోహ్లీకి మద్దతుగా… కపిల్ కు పంచ్ ఇచ్చిన రోహిత్..!

Visitors Are Also Reading