Home » ఈ 5 చిట్కాలతో మోకాళ్ళ నొప్పుల బాధ నుంచి సులభంగా బయటపడచ్చు..!

ఈ 5 చిట్కాలతో మోకాళ్ళ నొప్పుల బాధ నుంచి సులభంగా బయటపడచ్చు..!

by Sravya
Ad

ఈరోజుల్లో అనారోగ్య సమస్యలకి వయసుతో పని లేకుండా పోయింది. ఏ వయసులో ఎవరికి ఎలాంటి సమస్య వస్తుంది అనేది ఎవరికీ తెలియడం లేదు. ముఖ్యంగా చాలా మందిలో నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు ఇలా చిన్న వయసు వారికైనా పెద్ద వయసు వారికైనా మోకాళ్ళ నొప్పులు తగ్గడం లేదు. మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి.

Knee Pain Symptoms, Risk Factors, Diagnosis and Treatment | Narayana Health

Advertisement

  1. ఏదైనా గాయం వలన కానీ మెడికల్ కండిషన్ వలన కానీ మీరు రోజూ చేసే పనులన్నీ బట్టి కానీ మోకాళ్ళ నొప్పులు సహజంగా వచ్చే అవకాశం ఉంది.
  2. ఎక్కువగా మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అల్లం, పసుపు బాగా పనిచేస్తాయి. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో అల్లం, పసుపు వేసి 15 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించండి. తర్వాత ఈ జ్యూస్ ని మీరు తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పి నుండి రిలీఫ్ ని మీరు పొందొచ్చు.
  3. మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు మంచిగా మసాజ్ చేస్తే కూడా ప్రభావం బాగా పడుతుంది. ఎక్కువ మోకాళ్ళ నొప్పులు కలిగినట్లయితే హీట్, కోల్డ్ కంప్రెస్ ని ఉపయోగించవచ్చు. హీట్ కంప్రెస్ ని నొప్పి ఎక్కువ ఉంటే మాత్రం వాడకండి. ఎందుకంటే ఇంకా నొప్పి కలుగుతుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళకి హిట్ కంప్రెసర్ బాగా పనిచేస్తుంది. ఆటలు సమయంలో గాయాలైనప్పుడు కోల్డ్ కంప్రెసర్ ని ట్రై చేయండి.
  4. ఎప్సన్ సాల్ట్ ని స్నానం చేసే నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే చక్కటి పరిష్కారం మీకు కనబడుతుంది. వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  5. అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాసు నీళ్లలో వేసుకుని తాగితే మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. రాత్రి నిద్ర పోయేటప్పుడు తాగితే చాలా చక్కగా ఈ చిట్కా పనిచేస్తుంది.

Advertisement

ఈ సందర్భాల్లో మాత్రం వైద్యుని సలహా మస్ట్:

  • మోకాళ్ళ నొప్పులు వచ్చి వాపు వంటివి ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.
  • మీ కాలి బరువుని మీరు తట్టుకోలేకపోతున్నప్పుడు కూడా వెంటనే కన్సల్ట్ చేయండి.
  • విపరీతమైన నొప్పి కలుగుతున్నప్పుడు అశ్రద్ధ అస్సలు చెయ్యద్దు.
  • నొప్పి బాగా ఎక్కువగా వస్తున్నా కూడా డాక్టర్ దగ్గర కి వెళ్ళండి.
  • ఎప్పుడైనా పడిపోయినప్పుడు విపరీతమైన మోకాళ్ళ నొప్పి వస్తే కచ్చితంగా డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.
  • కొన్ని రోజుల్లో నొప్పి తగ్గక పోయినా కూడా డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

డాక్టర్ సుధీర్ దారా MBBS,MD, బెస్ట్ పెయిన్ స్పెషలిస్ట్ (ఎపిఓని పెయిన్ మానేజ్మెంట్ & రీజెనరేటివ్ సెంటర్) ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలు ఇవి.

మోకాళ్ళ నొప్పులతో చాలామంది ఆపరేషన్ కూడా చేయించుకుంటున్నారు. ఈ కాలంలో చాలా మందిని మనం చూసాం. మోకాళ్లలో గుజ్జు అరిగిపోయినప్పుడు మోకాలు సరిగా పనిచేయదు. ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ గుజ్జుని పెంచితే కచ్చితంగా సమస్య తగ్గుతుందని డాక్టర్ అన్నారు. కేవలం పేషెంట్ యొక్క రక్తంతోనే చిన్న ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుందని డాక్టర్ వివరించారు. పేషెంట్ యొక్క రక్తంతోనే తిరిగి మళ్ళీ పేషెంట్ ని మామూలు మనిషి కింద నయం చేయొచ్చు. ఈ చిన్న ప్రొసీజర్ తో పేషెంట్ సులభంగా నడుస్తారు. భుజం లో కూడా ఇటువంటి సమస్య కలిగినట్లయితే పరిష్కరించవచ్చు. ఇలా చాలా అమూల్యమైన విషయాలని డాక్టర్ గారు చెప్పారు.

Find More Here: The Best Knee pain Treatment Hospital in Hyderabad

Visitors Are Also Reading