Home » “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీజర్ విడుదల…!

“ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీజర్ విడుదల…!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన తాజా చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా నుండి ఇప్పటికే పోస్టర్ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తీహార్ లో సుధీర్ బాబు తన నటన తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఫిల్మ్ మేకర్ గా కనిపించబోతున్నారు.

Advertisement

Advertisement

అంతే కాకుండా కృతి శెట్టి సినిమాలో కూడా హీరోయిన్ గానే నటించబోతుంది. దాంతో ఇద్దరి మధ్య టీజర్ లో చూపించిన సీన్ లు అక్కట్టుకునే విధంగా ఉన్నాయి. అదే విధంగా కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఉండటం తో టీజర్ వినోదాత్మకంగా కనిపిస్తోంది. ఇక సుధీర్ బాబు టీజర్ లో ఎంతో మోడ్రన్ గా కనిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సుధీర్ బాబు చివరగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. మరి ఈ సినిమా సుధీర్ బాబుకు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

Visitors Are Also Reading