సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. అయితే యువతారలే కాకుండా లేటు వసులోనూ తారలు పెళ్లిళ్లు చేసుకోవడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. రీసెంట్ గా నటి పవిత్రాలోకేష్ నటుడు నరేష్ లు రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటిస్తున్నారు.
Advertisement
ALSO READ :ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అనౌన్స్ చేసిన వెంటనే చరణ్ ఎన్టీఆర్ లు ఏం చేశారో తెలుసా..?
అంతే కాకుండా నరేష్ దగ్గరుండి మరీ పవిత్రకు అవకాశాలు ఇప్పిస్తున్నాడంటూ కూడా టాలీవుడ్ లో ఓ టాక్ ఉంది. ఇక న్యూయర్ సంధర్బంగా ఈ జంట ఏకంగా ముద్దుపెట్టుకుంటున్న వీడియోను వదిలి తాము రిలేషన్ షిప్ లో ఉన్నామని ప్రపంచానికి తెలిపారు. అయితే దానికి ముందే ఇద్దరూ ఓ హోటల్ లో ఉండగా నరేష్ మూడో భార్య రమ్యారఘుపతి వెళ్లి రచ్చరచ్చ చేసింది.
ALSO READ : రంగస్థలం సినిమాలో చిట్టిబాబుకు ఆయన పేరు ఎలా తెలిసిందంటే ?
Advertisement
ఆనాటి నుండి నరేష్ పవిత్ర జంట పై దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి. ఇదిలా ఉంటే నరేష్ కు ఇది మూడో వివాహం అయితే పవిత్రకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. పవిత్రలోకేష్ కు ఇప్పటికే కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇక ఆయనతో విభేదాల వద్ద ఇద్దరూ విడిపోయారు.
అంతే కాకుండా పవిత్ర లోకేష్ నరేష్ కు దగ్గరయ్యింది. కాగా ఓ ఇంటర్వ్యూలో సుచేంద్రప్రసాద్ మాట్లాడుతూ సంచలన వ్యాక్యలు చేశాడు. పవిత్రకు లగ్జరీ లైఫ్ అంటే మోజని అన్నారు. ఆమె అవకాశవాది అని విజయ నిర్మలగారు ఇచ్చిన 1500 కోట్ల ఆస్తిని నొక్కేసిందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నన్ను వదిలేసి నరేష్ ను తగులుకుందంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం సుచేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Advertisement
ALSO READ :‘నాటునాటు’ పాటను నాటుగా పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !