Home » రోహిత్ శర్మ తీసుకుంటున్న నిర్ణయాలతో శుభ్ మాన్ గిల్ కెరీర్ ప్రశ్నార్థకం?

రోహిత్ శర్మ తీసుకుంటున్న నిర్ణయాలతో శుభ్ మాన్ గిల్ కెరీర్ ప్రశ్నార్థకం?

by Srilakshmi Bharathi
Ad

ఒకప్పుడు శుభ్ మాన్ గిల్ ను కూడా అద్భుతమైన ఆటగాడిగా, సూపర్ స్టార్ గా పరిగణించిన సంగతి తెలిసిందే. ఒక దశలో విరాట్ కోహ్లీ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగేది శుభ్ మాన్ గిల్ మాత్రమేనని అంతా అనుకున్నారు. భారత్ తరపున మూడు ఫార్మట్స్ లలో ఆడగలిగే బ్యాట్స్ మెన్ గా గిల్ పేరు తెచ్చుకున్నాడు. కానీ, రోహిత్ శర్మ తీసుకుంటున్న నిర్ణయాలు గిల్ కెరీర్ ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. తాజాగా రోహిత్ తీసుకున్న నిర్ణయంతో అతను టెస్టుల్లో మూడో నంబర్‌లో ఆడతాడు.

Advertisement

Advertisement

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి గిల్ మూడవ నెంబర్ లో ఆడడం ప్రారంభించాడు. తొలి టెస్ట్ మ్యాచ్ లలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి రోహిత్ మనసు గెల్చుకున్నాడు. కెప్టెన్ టెస్టులో జైస్వాల్‌ తో పాటుగా ఓపెనింగ్ చేయాలనీ అనుకున్నాడు. కానీ, యశస్వి ఓపెనింగులో వచ్చేసరికి గిల్ మూడవ స్థానానికి వెళ్ళాడు. ఇది అతని కెరీర్ కి మంచిది కాదు. మొదటి టెస్ట్ సిరీస్ లో, మొదటి ఇన్నింగ్స్ లో గిల్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

గిల్ చివరి చివరి 6 టెస్ట్ ఇన్నింగ్స్‌లను చూస్తే అవి ముప్పై పరుగుల మార్క్ కూడా లేదు. గత చివరి ఆరు టెస్ట్ ఇన్నింగ్స్ లలో 13, 18, 06, 10, 29*, 2 పరుగులు మాత్రమే చేసాడు. ఓపెనర్ గా 13, 18 పరుగులు చేయగా, మిగిలినవి మూడో నెంబర్ లో ఆడాడు. వెస్టిండీస్ పర్యటన నుంచి గిల్ మూడవ స్థానంలో ఆడాడు. ప్రస్తుతం గిల్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ పరిస్థితిల్లో అతన్ని ఓపెనర్ గా ఉపయోగించుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.

 

Visitors Are Also Reading