Home » సుమ గురించి ఎవరికీ తెలియని కోణాన్ని బయట పెట్టిన అల్లరి సుభాషిణి..!

సుమ గురించి ఎవరికీ తెలియని కోణాన్ని బయట పెట్టిన అల్లరి సుభాషిణి..!

by Azhar
Ad

తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ హీరో ఎవరు.. హీరోయిన్ ఎవరు అంటే మాత్రం చాలా పేర్లు వినిపిస్తాయి. అదే తెలుగులో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే మాత్రం అందరూ చెప్పే పేరు ఒక్కటే.. అదే సుమ. బుల్లితెరపై ప్రస్తుతం సుమ కనకాల ఓ సూపర్ స్టార్ కంటే తక్కువేం కాదు. ఆ ఛానల్.. ఈ ఛానల్ అనే తేడాలేకుండా అని ఛానెల్స్ లో షోలు చేస్తా ఉంటుంది. సుమ ఉంది అంటే.. ఆ షో సూపర్ హిట్ చాలా మంది ఫిక్స్ అవుతారు. ఆ షో కంటెంట్ అనేది ఎలా ఉన్న కూడా.. సుమ తన స్టైల్ లో దానిని నడిపించడమే ఆమెకు ఉన్న ఫ్యాన్స్ కు తెగ నచ్చుతుంది.

Advertisement

కేవలం షోలు మాత్రమే కాకుండా.. ప్రతి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా సుమనే హోస్ట్ గా ఉంటుంది. ఒకవేళ సుమ నో చెబితేనే ఆది ఆ ఈవెంట్ మరొకరికి వెళ్తుంది. ఇలా ఇంతలా డిమాండ్ లో ఉన్న సుమ… రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటుంది అనే ప్రచారం ఉంది. ఆమె ఒక్కో షోకు లక్షల్లో వసూల్ చేస్తుంది అని అందరికి తెలసు. కానీ సుమ గురించి ఎవరికీ తెలియని ఓ కోణాన్ని అల్లరి సినిమా ఫెమ్ సుభాషిణి బయటపెట్టింది. అయితే తాజాగా సుమ హోస్ట్ గా వ్యవరించే క్యాష్ అనే షో యొక్క ప్రోమో అనేది బయటకు వచ్చింది. ఈసారి ఈ షోకు ఓల్డ్ కమెడియన్స్ అల్లరి ఫేమ్ సుభాషిణి, కృష్ణవేణి, బాలాజీ, జెన్నీ వంటి వారు వచ్చారు.

Advertisement

ఇక ఈ ప్రోమో మొదట్లో మామూలుగానే ఉన్న కూడా చివర్లో మాత్రం అందరిని కట్టిపడేస్తుంది. ఈ ప్రోమో ఆఖర్లో సుభాషిణి మాట్లాడుతూ… నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం సుమ. నాకు కావాల్సిన ప్రతి సమయంలో కూడా సుమ నాకు మందులు నేయి పంపిస్తుంది. నేను ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం సుమనే. కాబట్టి మరో జన్మలో సుమ నా కడుపులో పుట్టాలి అని అనుకుంటున్నాను అని సుభాషిణి పేర్కొంది. ఇక సుభాషిణి మాటలు విన్న తర్వాత ఎమోషనల్ అయిన సుమ వెళ్లి ఆమెను హగ్ చేసుకుంటుంది. ఇక ఈ ప్రోమో చూసిన అందరూ ఎమోషల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీని టీ20ల్లో నుండి తప్పించాలి అంటున్న జడేజా..!

నేను చెప్పను అని ఇంగ్లిష్ మీడియాకు చెప్పిన భువనేశ్వర్…!

Visitors Are Also Reading