సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి వలలో అమాయకులు చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. సామాన్యులే కాకుండా చదువుకున్నవారు, ఉద్యోగులు ఇలా నిత్యం మోసపోతున్నారు. అయితే, తాజాగా గుంటూరు జిల్లాలో కిడ్నీకి రూ. 7 కోట్ల ఆఫర్ కలకలం సృష్టించింది. ఆన్లైన్ లో ఉన్న సమయంలో, కిడ్నీ అమ్మితే భారీగా డబ్బులు వస్తాయని ఓ లింక్ చూసిన ఇంటర్ విద్యార్థిని, ఆ లింక్ క్లిక్ చేసి తన వివరాలు పొందుపరిచింది. ఇక, కిడ్నీ అమ్మితే రూ.7 కోట్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆ యువతికి ఆఫర్ ఇచ్చారు. అలా సైబర్ నేరగాళ్లు, ఆ విద్యార్థితో పరిచయం చేసుకున్నారు.
READ ALSO : సౌందర్య చనిపోవడానికి ముందే ఆమెకు 3 ప్రమాదాలు జరిగాయి..కానీ కొంచెంలోనే ?
Advertisement
ఫేక్ అకౌంట్ చూపి 3 కోట్ల రూపాయలు బాధిత యువతి ఖాతాలో జమ చేసినట్లు చూపించారు. అయితే, అక్కడే అసలు రూపాన్ని బయటపెట్టారు కేటుగాళ్లు, ఆ డబ్బులు రిలీజ్ కావాలంటే తమకు నగదు పంపాలని చెప్పారు. దీంతో విద్యార్థినిని విడతల వారీగా, సైబర్ మోసగాళ్లకు రూ. 16 లక్షలు పంపింది. డబ్బులు ఇస్తామని ఢిల్లీకి రావాలని చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లారు. అయితే, తాను మోసపోయినట్లు తెలుసుకున్న విద్యార్థినిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని విద్యార్థినిని విజ్ఞప్తి చేసింది. అయితే, ఈ కిడ్నీ ఆఫర్ పై ప్రముఖ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన యువతి, తాను ఎలా మోసపోయానో వివరించింది. తాను నాన్నకు తెలియకుండా, రూ. 80,000 వాడుకున్నాను. అయితే, ఆ మొత్తాన్ని మళ్లీ నాన్న ఖాతాలో వేయాలి అనుకున్నాను. ఈ సందర్భంలోనే కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని తెలుసుకుని, దానికోసం వెతికానని దాంతో, కిడ్నీ డొనేటెడ్ యాప్ తగిలిందన్నారు. ఇక, వాళ్లు లీగల్ చార్జీలు, ఇతర ఖర్చులు ఇలా వాళ్ళు అడిగినప్పుడు అల్లా డబ్బులు చెల్లిస్తూ పోయా, మొత్తం రూ. 16 లక్షలు వారికి ఇచ్చానని వెల్లడించింది విద్యార్థిని.
READ ALSO : Andrew Flintoff : ఆండ్రూ ఫ్లింటాఫ్ కు యాక్సిడెంట్.. హెలికాఫ్టర్ లో తరలింపు