నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న సౌత్ కొరియన్ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ కాపీని తమ దేశంలోకి తీసుకువెళ్లినందుకు…విక్రయించినందుకు ఓ విద్యార్థికి ఉత్తరకొరియా ప్రభుత్వం ఏకంగా మరణశిక్షను విధించింది. వినడానికి షాకింగ్ గా ఉంది కదూ…కానీ ఇలాంటి శిక్షలు వేరే దేశంలో వేస్తే షాక్ అవ్వాలిగానీ ఉత్తరకొరియాలో చిన్న చిన్న తప్పులకు కఠిన శిక్షలు వేయడం కామనే…ఉత్తర కొరియా ప్రభుత్వం తమ పొరుగు దేశమైన దక్షిణ కొరియాతో సై అంటే సై అంటూ కత్తిదూస్తుంది. ఇక ఆ దేశంలోనే తెరకెక్కిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్…
అయితే ఈ వెబ్ సిరీస్ ఉత్తర కొరియాలో అందుబాటులో లేదు. కానీ ఇటీవల చైనా వెళ్లిన ఓ విద్యార్థి తన యూఎస్ బీలో ఈ వెబ్ సిరీస్ ను వెసుకున్నాడు. ఇక తాను ఆ వెబ్ సిరీస్ ను చూసి ఊరుకోకుండా తన స్నేహితులకు కూడా చూపించాడు. మరొక విద్యార్థికి కాపీని డబ్బులకు అమ్ముకున్నాడు.
Advertisement
Advertisement
దాంతో శత్రు దేశం తెరకెక్కించిన వెబ్ సిరీస్ ను చూడటమే కాకుండా మరికొంత మందికి చూపిస్తావా అంటూ ఉత్తరకొరియా ప్రభుత్వం అతడికి ఉరిశిక్షవిధించింది. ఇక ఈ వెబ్ సిరీస్ చూసిన మరికొంత మంది విద్యార్థులకు దేశంలోని గనుల్లో భానిసల్లా పనిచేసేలా శిక్ష విధించిందట.
ఇక వెబ్ సిరీస్ కాపీని కొనుగోలు చేసిన మరో విద్యార్థికి కూడా జీవిత ఖైదు విధించింది. అక్కడితో ఆగకుండా విద్యార్థులు పక్కదేశం వెబ్ సిరీస్ లు తెచ్చి చూస్తుంటే మీరు గాడుదెలు కాస్తున్నారా అంటూ స్కూల్ యాజమాన్యం మొత్తాన్ని సస్పెండ్ చేసిందట. ఇక ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా ప్రచురించింది. ఈ వార్త కాస్తా భయటకు రావడంతో మన దేశంలో రేప్ చేసినా ఇంత కఠిన శిక్షలు వేయరు కదా అంటూ జోకులు చేసుకుంటున్నారు. ఇక మరికొందరు కిమ్ మామా మజాకా అంటూ సెటైర్లు వేస్తున్నారు.