Home » STATUE OF UNITY : స‌మ‌తామూర్తి విగ్రహం ప్ర‌త్యేక‌త‌లు ఏంటి..ఎంత బంగారం వాడారు..!

STATUE OF UNITY : స‌మ‌తామూర్తి విగ్రహం ప్ర‌త్యేక‌త‌లు ఏంటి..ఎంత బంగారం వాడారు..!

by AJAY
Ad

స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో రామానుజాచార్యుల కు హైదరాబాద్ శివారులోని ముచ్చింతల గ్రామంలో శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో లో భారీ విగ్రహాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం భారత దేశంలోనే రెండవ పొడవైన విగ్రహం గా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని పెద్ద విగ్రహాలలో 26వదిగా దీనిని నిర్మించినట్లు తెలిపారు. వైష్ణవ పీఠాధిపతి త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమం ప్రాంగణంలో దీనిని నిర్మిస్తున్నారు. 2014లో ప్రతిపాదనలు ఉండగా 2021లో విగ్రహం పూర్తయింది.

statue of unity

Advertisement

Advertisement

ఇక ఈ విగ్రహం ప్రత్యేకతలు చూసినట్లయితే….. వాస్తవ విగ్రహం ఎత్తు 108 అడుగులుగా ఉంది. రామానుజాచార్యుల‌ చేతిలోని త్రిదండి తో కలిపి మొత్తం ఎత్తు 135 అడుగులుగా ఉంది. ఈ మొత్తం వేదిక ఎత్తు 55 అడుగులు కాగా ప‌ద్మ‌పీఠం ఎత్తు 27 అడుగులుగా ఉంది. ఈ వేదికకు భ‌ద్రపీఠం అనే పేరును పెట్టారు. ఇక కింద పీఠం తో కలిపి 216 అడుగులు ఉంటుంది. విగ్రహం ఉండే పీఠంపై 54 కలువ రేకులు ఉన్నాయి. 18 శంకాలు 18 చక్రాలు కూడా ఉన్నాయి.

kcr family at statue of unity

ఈ విగ్రహం దగ్గరకు ఎక్కడానికి మొత్తం 108 మెట్లు ఉన్నాయి. ఈ విగ్రహంలో వివిధ ద్ర‌విడ రాజ్యాల శిల్ప క‌ళ కనిపిస్తుంది. విగ్రహం చేతివేళ్ల నుండి 135 అడుగుల వరకు ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఈ విగ్రహంలో రామానుజ చార్యులు ధ్యానంలో కనిపిస్తున్నారు. ఇక భ‌ద్ర‌పీఠంలో 120 కిలోల బంగారు విగ్రహం పెడుతున్నారు. రామానుజాచార్యులు 120 ఏళ్లు జీవించారని అన్న‌దానికి చిహ్నంగా 120 కేజీల బంగారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్న‌ నిర్వాహకులు ప్రకటించారు.

Visitors Are Also Reading