Home » SBI నుంచి మంచి అవకాశం.. ఇంట్లో ఉంటూ 6 లక్షల ఆదాయం..ఎలాగంటే..?

SBI నుంచి మంచి అవకాశం.. ఇంట్లో ఉంటూ 6 లక్షల ఆదాయం..ఎలాగంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండియాలోనే అతిపెద్ద బ్యాంకు గా పేరు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్. అత్యంత సురక్షితమైన సంస్థగా రిజర్వు బ్యాంకు నుండి గుర్తింపు పొందింది. ఈ బ్యాంకు దేశంలో 47 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 28 వేల కి పైగా బ్యాంక్ బ్రాంచ్ లను కలిగి ఉంది. అయితే వాణిజ్య ప్రాంతాల జనాభా ప్రాతిపదికన వాటి యొక్క శాఖలను పెంచుతూ ఉంటుంది. ఇలా ఈ బ్యాంకు ఏదైనా కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయాలంటే స్థలాన్ని లేదా భవనం అద్దెకు లేదా లీజుకు తీసుకుంటుంది.

Advertisement

also read:మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా సినిమాల్లో నటించిన విషయం మీకు తెలుసా ?  

Advertisement

ఈ విధంగా ఈ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవడం వల్ల అద్దె రూపంలో మంచి ఆదాయాన్ని మనం పంచుకోవచ్చు. అయితే ఈ బ్యాంకుకు పెద్ద నగరాల్లో అయితే 20వేల నుంచి ఆరు లక్షల వరకు అద్దె చెల్లిస్తూ ఉంటుంది. ఈ అద్దె రేట్లు కూడా స్థలం లేదా భవనం ఉన్న ప్రాంతాన్ని బట్టి సౌకర్యాల ఆధారంగా మారుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5000 నుంచి 40,000 వరకు అద్దె రూపంలో బ్యాంకు తన శాఖను ఏర్పాటు చేసిన భవనం లేదా స్థల యజమానులకు చెల్లిస్తుంది.

దీనికోసం కనీసం ఐదు నుంచి 15 సంవత్సరాల కాలానికి లీజు ఒప్పందం చేసుకుంటుంది. దీని తర్వాత పొడగించే అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకు ను లీజుకు లేదా అద్దెకు తీసుకునే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది యాజమాన్యం. బ్యాంకు లీజుకు తీసుకునే స్థలం లేదా భవనానికి తగిన పార్కింగ్ స్థలం, గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్, జనరేటర్ పవర్ బ్యాంక్ ఆఫ్, 24 గంటల నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఈ భవనం ముందు 10 అడుగుల కంటే ఎక్కువ ఉండాలి.

also read:

Visitors Are Also Reading