Telugu News » Blog » టాలీవుడ్ లో సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా ?

by AJAY

మ‌న‌ దేశంలో సాంప్రదాయం ప్రకారం అత్త కూతుళ్లను అంటే మరదళ్లను పెళ్లి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం మరదల ను వివాహం చేసుకోవడం బాగా తగ్గిపోయింది కానీ ఒకప్పుడు మాత్రం ఎక్కువగా సొంత మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లి చేసుకునే వారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో మన స్టార్ లు ఎందరో తమ సొంత మరదళ్ల‌ను పెళ్లి చేసుకొని ఆనందంగా గడిపారు. అలా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

nt ramarao wife

nt ramarao wife

1) ఎన్టీ రామారావు
తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటుడు ఎన్టీరామారావు ఆయన సొంత మరదలు బసవతారకం ను వివాహం చేసుకున్నారు. 1942లో ఎన్టీ రామారావు బసవతారకంను బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య లో వివాహం చేసుకున్నారు. అప్పటికీ ఎన్టీఆర్ ఇంకా సినిమాల్లోకి ప్రవేశించలేదు. అంతేకాకుండా బసవతారకం ఎన్టీఆర్ ను ఇష్టపడటం తో వారిద్దరి వివాహం కుటుంబ సభ్యులు ద‌గ్గ‌రుండి జ‌రిపించార‌ట‌.

nageshwer rao wife

nageshwer rao wife

2) అక్కినేని నాగేశ్వరరావు
టాలీవుడ్ లోని మరో సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా సొంత మరదలిని పెళ్లి చేసుకున్నారు. నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మను 1949 లో వివాహం చేసుకున్నారు. నాగేశ్వరరావు అప్పటికే పది చిత్రాల్లో నటించారు.

mohan babu nirmaladevi

mohan babu nirmaladevi

3) మోహన్ బాబు
డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తన సొంత మరదలు విద్యా దేవిని వివాహం చేసుకున్నారు. విలన్ గా వెండితెరకు పరిచయమైన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే విద్యా దేవి హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన తర్వాత ఆమె సొంత చెల్లెలు అయిన నిర్మలాదేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు.

Advertisement

hero adi wife

hero adi wife

4) ఆది
సాయికుమార్ కుమారుడు ఆది ఆయన సొంత మరదలిని వివాహం చేసుకున్నాడు. సాయి కుమార్ భార్య తమ్ముడి కూతురు తో ఆది పెళ్లి జరిగింది. వీరిద్దరి వివాహాన్ని చిన్నప్పుడే పెద్దలు నిశ్చయించిన‌ట్టు తెలుస్తోంది.

karthi wife

karthi wife

5) కార్తీ
తమిళ హీరో సూర్య తమ్ముడిగా ప్రేక్షకులకు పరిచయమైన కార్తీ కూడా ఆయన మర‌ద‌లినే వివాహం చేసుకున్నారు. ఆవారా సినిమాతో టాలీవుడ్ లోనూ కార్తి అభిమానులను సంపాదించుకున్నారు.

krishna his wife

krishna his wife

6) కృష్ణ
టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ సైతం ఆయన సొంత మరదలు ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. 1961లో వీరి వివాహం జరిగింది. అయితే కృష్ణ న‌టి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

also read : నెట్టింట వైర‌ల్ అవుతున్న అన్న‌గారి పెళ్లి ప‌త్రిక..!