Home » బాలయ్యను అవమానించిన స్టార్ హీరోయిన్.. మరీ అంత వద్దమ్మ అంటున్న ఫ్యాన్స్..!!

బాలయ్యను అవమానించిన స్టార్ హీరోయిన్.. మరీ అంత వద్దమ్మ అంటున్న ఫ్యాన్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య అంటే ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు.. అలాంటి బాలకృష్ణ ఇండస్ట్రీలో ఏదైనా మొహం మీదే మాట్లాడే హీరోగా పేరు తెచ్చుకున్నారు.. మనసులో ఏది దాచుకోకుండా డైరెక్ట్ గా అనేస్తారు. కుట్రలు,కుతంత్రాలు ఆయనకు తెలియవు.. 60 సంవత్సరాల వయసు దాటినా కుర్ర హీరోలకు పోటీనిస్తూ ఇప్పటికి సినిమాలు తీస్తున్నారు.. అలాంటి బాలయ్య సినిమాలో ఛాన్స్ కోసం ఎవరైనా ఇట్టే ఎదురు చూస్తూ ఉంటారు.. ఛాన్స్ దొరికితే చాలు మా జన్మ ధన్యం అయింది అనుకునే నటులు కూడా ఉన్నారు.. అలాంటి నందమూరి బాలకృష్ణ ఛాన్స్ ఇస్తే ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

Advertisement

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య త్వరలోనే గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి భారీగా రిలీజ్ కానుంది. అంతేకాకుండా అనిల్ రావిపూడి తో సైతం ఒక సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో శ్రీలీలా నందమూరి బాలయ్య కూతురి గా నటించబోతుందని, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందని అదే మూవీకి మెయిన్ పాయింట్ గా నిలబడుతుందని తెలుస్తోంది.అయితే ఆ పాత్ర కోసం సాఫ్ట్ నేచర్ కలిగిన హీరోయిన్ కావాలని అనిల్ రావిపూడి బాలయ్యకు చెప్పారట. దీంతో బాలయ్య తన ఫేవరెట్ హీరోయిన్ అయిన స్నేహాను పాత్రకు సజెస్ట్ చేశారని సమాచారం.

అయితే స్నేహ కథ విని మొదట్లో ఓకే చెప్పింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల తప్పుకున్నట్టు తెలుస్తోంది.. దీంతో కొందరు నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.. అంతటి స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే వద్దంటావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. నువ్వు ఆ మూవీ నుండి తప్పుకుని బాలయ్యను అవమానిస్తున్నావంటూ కొందరు ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా బాలయ్య కు కూడా చేరింది. దీంతో ఆయన సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ ఎవరి వ్యక్తిగత కారణాలు వారికుంటాయంటూ చెప్పుకొచ్చారు.. ఏది ఏమైనా బాలయ్య మంచితనం మరోసారి బయటపడింది.

also read:

Visitors Are Also Reading