Home » తనకు ఇష్టమైన బౌలర్లు వీరే.. బాలయ్య కామెంట్స్ వైరల్..!

తనకు ఇష్టమైన బౌలర్లు వీరే.. బాలయ్య కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలియని వారు ఎవ్వరుండరు. బాలయ్య ప్రస్తుతం ఏ పని చేసినప్పటికీ ఆయనకు అనుకూలంగా ఫలితాలు వస్తుండటం హర్షించదగ్గ విషయం. ఓటీటీలలో బాలయ్య చేసిన షోలు విజయం సాధించగా.. బాలయ్య నటించిన సినిమాలు సైతం కమర్షియల్ గా సక్సెస్ సాధించిన విషయం విధితమే. 

Also Read :  గుజరాత్ టైటాన్స్ కు పెద్ద ఎదురుదెబ్బ…IPL నుంచి కేన్ మామ ఔట్!

Advertisement

ప్రస్తుతం బాలయ్య-అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల బాలయ్యకి కూతురు, బాలయ్య శ్రీలీలకి బాబాయ్ అవుతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ జరుగుతుందని.. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.5కోట్లు ఖర్చు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.  రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారమందుతుంది. బాలయ్య ఇకపై వరుస సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ కి బాలయ్య కామెంటరీ చెప్పగా ఆ సమయంలో బాలయ్య చెన్నై ఎంత స్కోర్ చేస్తుందో ముందుగానే అంచనా వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కళాశాల రోజుల్లో తాను క్రికెట్ ఆడేవాడినని పేర్కొన్నారు.

Advertisement

Also Read :  చెన్నై కొంపముంచిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’!

Manam News

చాలా మంది క్రికెటర్లతో నాకు పరిచయముందని పేర్కొన్నారు. అనిల్ కుంబ్లే, పాల్ ఆడమ్స్, షేన్ వార్న్ వంటి బౌలర్లు తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు బాలయ్య.  ప్రస్తుతం బాలయ్య చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా బాలయ్య ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి సినిమా తరువాత బోయపాటి శ్రీను కాంబోలో మాస్ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం అఖండకు సీక్వెల్ అని పేర్కొంటున్నారు.  

Also Read :  అమలా టార్చర్ భరించలేకనే సమంత… నాగచైతన్యతో విడిపోయిందా…!

Visitors Are Also Reading