Home » దేవి శ్రీ ప్రసాద్ కు అవమానం.. ఇంటికి రమ్మని మరీ..?

దేవి శ్రీ ప్రసాద్ కు అవమానం.. ఇంటికి రమ్మని మరీ..?

by Azhar
Ad
టాలీవుడ్ లో ప్రస్తుతం మ్యూజిక్ ప్రపంచాన్ని ఏలుతున్న డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ తప్పకుండ ఉంటాడు. చిన్న వయసులోనే న్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. ఎంతో మంది సూపర్ స్టార్స్ కు తన మ్యూజిక్ ను అందించాడు. ఒకానొక సమయంలో ప్రతి సినిమా నిర్మాత గాని… హీరో గాని మ్యూజిక్ కోసం దేవి శ్రీ ప్రసాద్ నే సంప్రదించేవారు. అంతలా సూపర్ హిట్ అయిపోయాడు. ఇదే క్రమంలో దేవి శ్రీ ప్రసాద్ కు మన టాలీవుడ్ లో స్నేహితులు కూడా ఎక్కువే. ఇందులో స్టార్ హీరోలు కూడా ఉంటారు అనేడిల్లీ అందరికి తెలిసిందే.
అయితే గత కొంత కాలంగా దేవి శ్రీ ప్రసాద్ టైం అనేది అంతగా నడవటం లేదు. ఇప్పుడు మొత్తం తెలుగులో థమన్ టైం నడుస్తుంది. అప్పట్లో దేవి శ్రీ ప్రసాద్ చేసిన విధంగానే ప్రతి చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకు అన్నింటికీ థమన్ నే మ్యూజిక్ అనేది అందిస్తున్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనేది అందరికి తెలుసు. ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్ అవడమే కాకుండా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది.
అదేంటంటే… మధ్యలో దేవి కొంత డౌన్ అయినప్పుడు ఆయనను ఓ స్టార్ హీరో అవమానించాడట. అంతకముందే దేవి ఆ హీరోకు సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. కానీ ఆ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు.. కూడా ఆ హీరో సినిమా కోసం మూడు పాటలకు మ్యూజిక్ ఇచ్చాడట. కానీ అది విన్న హీరో.. తర్వాత నాకు ఈ మ్యూజిక్ నచ్చలేదు అని.. దేవి శ్రీ ప్రసాద్ ను ఇంటికి రమ్మని చెప్పి.. నిన్ను ఈ సినిమా నుండి తీసేస్తునాం. ని మ్యూజిక్ నచ్చలేదు అని చెప్పాడట. దానికి దేవి చాలా పెద్ద అవమానంగా భావించాడట.  మారి ఇప్పుడు పుష్పతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన దేవి… ఆ హీరోకు మళ్ళీ మ్యూజిక్ ఇస్తాడా.. లేదా అని చూడాలి.

Advertisement

Visitors Are Also Reading