Home » బాలకృష్ణ చేతిలో దెబ్బలు తిన్న స్టార్ దర్శకుడు ఎవరంటే..?

బాలకృష్ణ చేతిలో దెబ్బలు తిన్న స్టార్ దర్శకుడు ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నందమూరి బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం నెంబర్ వన్ సక్సెస్ రేట్ తో దూసుకుపోయేవారు. ఇప్పటికీ ఆ జోరు తగ్గలేదు కానీ కాస్త వెనుకబడి పోయారని చెప్పవచ్చు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీలు ఇస్తూ దూసుకుపోతున్నారు.. అప్పట్లో లక్ష్మీనరసింహ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తర్వాత ఆరేండ్ల పాటు ఒక హిట్ కూడా అందుకోలేదు. మళ్లీ బోయపాటితో చేసిన సింహ సినిమా వచ్చేదాకా బాలయ్య కం బ్యాక్ కాలేకపోయారు. దీనికి ముందు వచ్చిన వరుస సినిమాలు నిరాశపరిచాయి.

Advertisement

ఈ సందర్భంలోనే ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో చేసిన వీరభద్ర ఫ్లాప్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ దర్శకుడు గోపీచంద్ తో యజ్ఞం అనే ఒక భారీ హిట్ సినిమా తీసి ఉండటం వల్ల బాలయ్య అతనికి అవకాశం ఇచ్చారు. అంత పెద్ద స్టార్ హీరో అయిన బాలకృష్ణ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు స్టోరీని మారుస్తూ సరిగ్గా షూటింగ్ టైంకి కూడా రాకుండా తాగి సెట్ కి వచ్చేవారని సమాచారం. దీంతో ఈ విషయం బాలకృష్ణ వరకు వెళ్లడంతో మొదటిసారి మందలించి వదిలేసారట.

Advertisement

కానీ సీన్ మారకపోవడంతో బాలకృష్ణ ఆ డైరెక్టర్ పై చేయి కూడా వేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ చిత్రం ప్రొడ్యూసర్ అయిన అంబికా కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో రవికుమార్ చౌదరి గురించి కామెంట్ చేశారు. ఆయన తీసిన సినిమా వల్ల తనకి చాలా నష్టం వచ్చిందని ఇలాంటి డైరెక్టర్ వల్ల ప్రొడ్యూసర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని కూడా చెబుతూ తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత రవికుమార్ చౌదరి ఒక ఇంటర్వ్యూ పెట్టి ఆరోపణలకి వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది.

also read:

Visitors Are Also Reading