Home » పాపం:శృతిహాసన్ కి ఏమైంది? ముక్కు, కళ్ళు,నోరు మరీ డేంజర్ గా..!!

పాపం:శృతిహాసన్ కి ఏమైంది? ముక్కు, కళ్ళు,నోరు మరీ డేంజర్ గా..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతిహాసన్ కుటుంబంలో వరుస అవాంతరాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఆమె తండ్రి కమలహాసన్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చేరారు. ఇది మరవక ముందే శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో శృతిహాసన్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే ఎంతో గ్లామర్ గా కనిపించే ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత ఫాలోవర్స్ ను పెంచుకుంటారు. అందవిహీనమైన ఫోటోలు ఎప్పుడు కూడా షేర్ చేయరు. అలా చేయడానికి సాహసం కూడా చేయరు అనుకోండి.. కానీ శృతిహాసన్ మాత్రం ఢీ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసినా ఆమె అభిమానులంతా కంగారు పడుతున్నారు.. శృతిహాసన్ కి ఏమైంది.. ఆమె ముఖం ఏంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ శృతిహాసన్ మాత్రం ఏమాత్రం వెనకంజ వేయకుండా తన అందవిహీనమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

దీనికి కారణం ఆమె ఫీవర్, సైనస్ వ్యాధితో బాధపడుతుందట. బ్యాడ్ డే, బ్యాడ్ హెయిర్ తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని మీరు అంగీకరిస్తారు.. ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ తన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శృతిహాసన్ ముఖం మొత్తం ఉబ్బిపోయి చాలా డల్ గా కనిపిస్తోంది.. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా శృతి ఏంటి ఇలా తయారయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.. మరికొందరు ఇలాంటి ఫోటోలు షేర్ చేయడానికి ధైర్యం ఉండాలి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

also read:

Visitors Are Also Reading