Home » ప్ర‌భాస్ అంత సైలెంట్ ఏం కాదు : శృతి హాస‌న్

ప్ర‌భాస్ అంత సైలెంట్ ఏం కాదు : శృతి హాస‌న్

by AJAY
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌భాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా శృతి హాస‌న్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెళ్ల‌డించింది. సలార్ సినిమా షూటింగ్ ను తాను ప్ర‌భాస్ చాలా ఎంజాయ్ చేస్తున్నామ‌ని చెప్పింది.

Advertisement

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించ‌డం త‌న‌కు అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపింది. ప్ర‌భాస్ ఒక్క‌సారి ప‌రిచ‌యం అయితే చాలా క్లోజ్ అవుతారని తెలిపింది. అంతే కాకుండా ప్ర‌భాస్ అంత సైలెంట్ కాద‌ని ఆయ‌న క్లోజ్ అవ్వ‌డానికి కొంత టైం ప‌డుతుంద‌ని పేర్కొంది. ప్ర‌భాస్ సైలెంట్ అని అంతా అనుకుంటున్నారని కానీ అది అబద్దం అని స్ప‌ష్టం చేసింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ అంతా ప్ర‌భాస్ సిగ్గుప‌డతాడ‌ని ఎవ్వ‌రితో మాట్లాడ‌ర‌ని చెప్పుకునేవారు. కానీ శృతి హాసన్ అది తూచ్ అని క్లారిటీ ఇచ్చింది.

Visitors Are Also Reading