Telugu News » త‌ల్లి షాలిని కాకుండా జూనియ‌ర్ ఎన్టీఆర్ అమ్మ అని పిలిచే మ‌హిళ ఎవ‌రో తెలుసా..?

త‌ల్లి షాలిని కాకుండా జూనియ‌ర్ ఎన్టీఆర్ అమ్మ అని పిలిచే మ‌హిళ ఎవ‌రో తెలుసా..?

by AJAY MADDIBOINA

ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌కు ముందే ప్ర‌మోష‌న్లు దేశ‌వ్యాప్తంగా హ‌డావిడి సృష్టించారు. కేవ‌లం దేశంలోనే కాకుండా దుబాయ్‌, అమెరికా వంటి ప్రాంతాల్లో కూడా ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్లు నిర్వ‌హించారు. సినిమా విడుద‌ల అయిన త‌రువాత అదేస్థాయిలో క‌లెక్ష‌న్లు కూడా వ‌సూలు చేస్తోంది.

Ads

Also Read :  NIHARIKA KONIDELA : నిహారిక మిస్ చేసుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా…ఆ సినిమా చేసుంటే.!


ఇదిలా ఉండ‌గా.. ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా.. పెర్పామెన్స్ స్పీచ్‌కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి చిట్‌చాట్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రు మాత్ర‌మే పాల్గొన్నారు. ఈ త‌రుణంలో కీర‌వాణి తాను సంగీతం అందించిన పాట‌ల్లో ఏ పాట అంటే న‌చ్చ‌దు అని కీర‌వాణి ఎన్టీఆర్‌ను అడిగాడు. అందుకు ఎన్టీఆర్ నాగార్జున హిట్ సినిమా ఘారానా బుల్లోడు సినిమాలో భీమ‌వ‌రం బుల్లోడా పాట అంటే త‌న‌కు న‌చ్చ‌దు అని చెప్పి కీర‌వాణికి షాక్ ఇచ్చాడు. ఆ పాట‌లో లిరిక్ లేదా మ‌ధ్య‌లో వ‌చ్చే బీటో కానీ ఎందుకో ఆ పాట అంటే త‌న‌కు అస‌హ్యం వేస్తుంద‌ని చెప్పాడు. అదేవిధంగా ఎన్టీఆర్ అర‌వింద స‌మేత సినిమాలో రెడ్డ‌మ్మ త‌ల్లి పాట పాడిన మోహ‌నా భోగ‌రాజ్ అంటే త‌న‌కు చాలా ఇష్టం అని చెప్పాడు.


ఇక కీర‌వాణి నీ మొబైల్ లో కేవ‌లం 1 ప‌ర్సంట్ ఛార్జీంగ్ మాత్ర‌మే ఉంది. అప్పుడు కీర‌వాణి, రాజ‌మౌళి, దాన‌య్య‌, శ్రీ‌వ‌ల్లి న‌లుగురిలో ఒక‌రికే కాల్ చేసే ఛాన్స్ ఉంటే ఎవ‌రికి చేస్తావు..? అని ఎన్టీఆర్‌ను కీర‌వాణి ప్ర‌శ్నించాడు. అప్పుడు తార‌క్ డైరెక్ట్‌గా శ్రీ‌వ‌ల్లి పేరు చెప్పాడు. తాను శ్రీ‌వ‌ల్లికి కాల్ చేస్తాన‌ని.. శ్రీ‌వ‌ల్లిని అమ్మ అని పిల‌వ‌డం ఎప్ప‌టి నుంచో ఉంద‌న్నాడు. తాను త‌న అమ్మ త‌రువాత శ్రీ‌వ‌ల్లిని మాత్ర‌మే అమ్మ అని పిలుస్తాన‌ని ఎన్టీఆర్ చెప్పాడు. శ్రీ‌వ‌ల్లికి కాల్ చేస్తే అంద‌రికీ కాల్ చేసిన‌ట్టే అని వివ‌రించాడు.

Also Read :  వేప‌చెట్ల‌కు ఏంటా రోగం? ఏం చేస్తే చెట్లు బ‌తుకుతాయి?


You may also like