Telugu News » Blog » శ్రీరెడ్డి చేప‌ల పులుసు…తింటే రెచ్చిపోవాల్సిందే అంటూ వీడియో..!

శ్రీరెడ్డి చేప‌ల పులుసు…తింటే రెచ్చిపోవాల్సిందే అంటూ వీడియో..!

by AJAY
Ads

శ్రీరెడ్డి అంటే టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సినిమాల కంటే వివాదాల‌తోనే శ్రీరెడ్డి పాపుల‌ర్ అయ్యింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ వివాదంతో శ్రీరెడ్డి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అని తెలుగు వాళ్లకు సినిమా అవ‌కాశాలు రావాల‌ని నానా ర‌భ‌స చేసింది. అంతే కాకుండా త‌న‌తో ఎంజాయ్ చేసిన బ‌డా బాబుల ఫోటోల‌ను కూడా శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్టి సంచ‌ల‌నం రేపింది.

టాలీవుడ్ లోని ప‌లువురు ప్ర‌ముఖుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక చేసిన ర‌చ్చ‌తో శ్రీరెడ్డి ని మా నుండి వెలేయ‌డంతో చెన్నైకి మ‌కాం మార్చింది. అక్క‌డా కూడా ఆఫ‌ర్ లు రాక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా కాలం గడిపేస్తోంది.

ఏపీలో వైసీపీకి స‌పోర్ట్ చేస్తూ టీడీపీ జ‌న‌సేన‌ల పై విమ‌ర్శ‌లు చేస్తూ త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కుతుంది. అంతే కాకుండా సినిమాలు రాజ‌కీయాల‌తో పాటూ సామాజిక అంశాల‌పై కూడా త‌న‌దైన స్టైల్ లో స్పందిస్తోంది. సొంతంగా యూట్యూబ్ ఛాన‌ల్ పెట్టుకుని వీడియోలు చేస్తోంది.

ALSO READ : “ముగ్గురు మొన‌గాళ్లు” సినిమాలో చిరుకు డూప్ లు గా న‌టించింది ఎవ‌రో తెలుసా..!

బాత్రూం టూర్ లు వంట‌లు, బ్యూటి టిప్స్ ఇలా అన్ని ర‌కాల వీడియోల‌తో శ్రీరెడ్డి వీడియోలు అద‌ర‌గొడుతోంది. ఇక తాజాగా శ్రీరెడ్డి త‌న యూట్యూబ్ చాన‌ల్ లో చేప‌ల పులుసు ఎలా త‌యారు చేయాలో ఓ వీడియోను షేర్ చేసింది. వీడియోలో స్వ‌యంగా చేప‌లు ప‌డుతున్నా అంటూ బిల్డప్ ఇచ్చి బంగారు తీగ‌తో చేప‌ల పులుసు అంటూ తంబ్ నెయిల్ పెట్టేసింది.


You may also like