Home » వెంకటేష్ సరసన హీరోయిన్ గా పాన్ ఇండియా బ్యూటీ?

వెంకటేష్ సరసన హీరోయిన్ గా పాన్ ఇండియా బ్యూటీ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ 61 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకీకి పలువురు సెలబ్రిటీలు బర్త్డే విషెస్ చెబుతున్నారు. వెంకీ తన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్న ఆరోగ్యం విషయంలో మాత్రం స్టైల్ ని బాగా ఫాలో అవుతాడు.

Advertisement

ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ యంగ్ హీరో విశ్వక్సే న్ నటించిన ఓరి దేవుడా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమా శైలేష్ కొలను దర్శకత్వంలో ఉండబోతోందని తెలుస్తోంది.

Advertisement

ఇటీవల హిట్ 2 సినిమాతో శైలేష్ మంచి హిట్ అందుకున్నాడు. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. గతంలో వెంకటేష్ పోలీస్ గెటప్ లో నటించిన ఘర్షణ సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే తరహా త్రిల్లర్ నేపథ్యం లో ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తుందని తెలుస్తోంది.

read also : మెగా ఫ్యామిలీపై విమర్శలు… రోజాను ఓ ఆట ఆడుకున్న బ్రహ్మాజీ !

Visitors Are Also Reading