దర్శకనిర్మాతలు ఏ సినిమాకైనా కథను బట్టి నటీనటులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేక పారితోషికంలో అభిప్రాయ భేదాల వల్ల అసలు నటీనటులు తప్పించి కొత్తవారిని ఆ స్థానంలో తీసుకోవడం సహజం. కానీ వారు ఒక సినిమా అవకాశం చేజారిపోతే చాలా బాధపడతారు. ఇలాంటి సమస్యే ఓ హీరో జీవితంలో ఎదురయ్యింది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. జరిగిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
విలన్ గా తన కెరీర్ ని ప్రారంభించి.. ఆ తర్వాత వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీకాంత్. అదే సమయంలో ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. మరోవైపు సపోర్టింగ్ యాక్టర్ గా కూడా నటించాడు. చాలా కాలం తర్వాత అఖండ సినిమాతో మళ్లీ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఓ ఇంటర్వ్యూ ద్వారా శ్రీకాంత్ తన కెరీర్ ఆరంభంలో ఆయన ఎదుర్కొన ఇబ్బందుల గురించి వెల్లడించారు.
హీరోగా చాన్స్ లు రాకపోవడంతో కొంతకాలం పాటు వరుసగా విలన్ పాత్రలు చేసుకుంటూ వెళ్లారట శ్రీకాంత్. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తనలో హీరోని చూసి వన్ టు చిత్రంలో అవకాశం ఇచ్చారట. ఆమె, తాజ్ మహాల్ చిత్రాలు నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ నిలిచ్చాయి. పెళ్లి సందడి సినిమా తర్వాత వెనక్కితిరిగి చూడలేదు. ఒకనొక దశలో ఏడాదిలో 13 సినిమాల్లో కూడా నటించాను. పగలు, రాత్రి తేడా లేకుండా సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
Advertisement
ఆ సమయంలోనే రాజశేఖర్ హీరోగా నటించిన వేటగాడు సినిమాల మొదటిగా శ్రీకాంత్ నే హీరోగా తీసుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల నన్ను హీరో పాత్ర నుంచి పక్కకు తప్పించారని చెప్పుకొచ్చారు..వేటగాడు సినిమాలో సౌందర్య, రంభ హీరోయిన్లు అని తెలియడంతో చాలా సంతోషపడ్డాను. కానీ చివరి క్షణంలో నన్ను తీసేయడంతో అంతకు ఎక్కువగా బాధపడ్డానని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. అయితే వేటగాడులో హీరోగా తొలగించినప్పటికీ.. సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను చేశానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఆ ఒక్క కారణంతోనే లావణ్య త్రిపాఠి ఆ హీరోతో పెళ్లికి నో చెప్పిందా ?
అదే నేను చేసిన పెద్ద మిస్టేక్.. వైరల్ అవుతున్న ఆమని కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా.. మల్టీస్టారర్ గా మారిన ధనుష్ మూవీ..!