ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళంకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్, తాత్కాలిక ప్రాతిపాదికన 60 జూనియర్ అసిస్టెంట్, ఓటి అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్, సోషల్ వర్కర్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Advertisement
READ ALSO : మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి ఏడవ తరగతి/ఎస్ఎస్సి/పదవ తరగతి/బిఏ/బి ఎస్ డబ్ల్యూ/ఎంఏ/ఎంఎస్డబ్ల్యూ/డిఎంఐటి/డిప్లోమా/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో 2 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
Advertisement
READ ALSO : కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా ? అందుకే అంత ఫిట్ గా ఉంటాడా !
ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 31, 2023వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆఫ్లైన్ విధానంలో కింది అడ్రస్ కు దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ. 32,670ల వరకు జీతంగా చెల్లిస్తారు.
Advertisement
READ ALSO : టీమిండియాలో నో ఛాన్స్.. ఇక సీరియల్లో నటిస్తున్న శిఖర్ ధావన్!