బిగ్ బాస్ సీజన్ 6 కు ఎండ్ కార్డ్ పడింది. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఫినాలే రానే వచ్చేసింది. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు రవితేజ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. అంతే కాకుండా సీనియర్ హీరోయిన్ రాధ కూడా గెస్ట్ గా వచ్చి సందడి చేసింది. మరోవైపు కంటెస్టెంట్ లు కంటెస్టెంట్ ల కుటుంబ సభ్యులు ఫినాలే లో సందడి చేశారు. ఇక టాప్ 4లో నిలిచిన వారిలో నాలుగవ స్థానంలో కీర్తి నిలిచింది.
Advertisement
అంతే కాకుండా మూడో స్థానంలో ఆదిరెడ్డి నిలిచాడు. ఇక రెండో స్థానంలో శ్రీహాన్ నిలిచాడు. దాంతో టైటిల్ విన్నర్ గా ఈ బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలిచి రేవంత్ కప్ తో పాటూ యాబై లక్షల ప్రైజ్ మనీ మరియు ఖరీదైన ఫ్లాట్ ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే అసలు విన్నర్ శ్రీహాన్ అవ్వాల్సింది. ఈ సీజన్ లో శ్రీహాన్ కు అత్యధికంగా ఓట్లు రావడంతో నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. స్వల్ప ఓట్ల తేడాతో రేవంత్ కంటే శ్రీహాన్ ముందు నిలిచాడు.
Advertisement
Advertisement
కానీ ముందు నాగార్జున 40లక్షల ఆఫర్ ఇచ్చి ఇది ఎవరు తీసుకుంటారో వాళ్లు రన్నర్ అవుతారు. తీసుకోకుండా రన్నర్ అయితే డబ్బులు కూడా రావని చెప్పాడు. అయితే కొంతమంది మాజీ కంటెస్టెంట్ లు మరియు శ్రీహాన్ కుటుంబ సభ్యులు అతడిని తీసుకోవాలని కోరారు. మొదట వద్దని చెప్పిన శ్రీహాన్ చివరికి టెంప్ట్ అయ్యాడు. పేరెంట్స్ కోసం తీసుకుంటున్నానని చెప్పాడు. దాంతో ట్రోఫీ తో పాటూ యాబై లక్షల డబ్బు మరియు బ్రేజా కారు రేవంత్ కు దక్కాయి. డబ్బు కోసం చూసి శ్రీహాన్ కప్పును మిస్ చేసుకున్నాడు. అంతే కాకుండా తల్లిదండ్రలు మరియు కంటెస్టెంట్ లు చెప్పిన మాటలు వినడమే శ్రీహాన్ కొంప ముంచింది.