Telugu News » Blog » ‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్ ఎలా ఉందంటే..?

‘శ్రీదేవి శోభన్ బాబు’ ట్రైల‌ర్ ఎలా ఉందంటే..?

by Anji

కొత్త సినిమాల‌కు ప్ర‌స్తుతం కొద‌వ లేదు. ఒక సినిమా హిట్ అయినా.. మ‌రొక సినిమా ప‌ట్ అయినా వ‌రుస సినిమాలు మాత్రం జ‌నాల ముందుకొస్తున్నాయి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమాల‌కు పోటీగా చిన్న సినిమాలు కూడా రావ‌డం విశేషం. కొన్ని సినిమాలు విజ‌యాన్ని అందుకుంటే.. మ‌రికొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డుతున్నాయి. ట్రైల‌ర్‌, టీజ‌ర్ ఇలా ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్న సినిమాలు జ‌నాల ముందుకొస్తే మాత్రం నెగిటివ్ టాక్‌నే సొంతం చేసుకోవ‌డం రెండు రోజుల‌కు దుకాణం బంద్ అవుతుంది.

Ads


ప్ర‌స్తుతం ఓ కొత్త ట్రైల‌ర్ సినిమా అభిమానుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. యంగ్ హీరో సంతోషం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత నిర్మిస్తున్నారు. ఓల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం దర్శకునిగా పరిచయమవుతున్నారు. 96, జాను చిత్రాలలో కథానాయికల చిన్నప్పటి పాత్రను గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది.

Ads

ఈ చిత్రము ఓవైపు లవ్, మరొకవైపు కామెడీ ఎమోషన్ సన్నివేశాలతో తెరకెక్కుతుంది. మెగా బ్రదర్ నాగబాబు చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో హీరోకి నోటి వాటం ఎక్కువ, హీరోయిన్ కు చేతి వాటం ఎక్కువ అంటూ పాత్రలను పరిచయం చేయడం బాగుంది. సంతోష్ శోభన్ యాక్టింగ్, గౌరీ అల్లరి గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఈ సినిమా తెరకెక్కుతోంది. ట్రైలర్ మొత్తం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

 

Also Read :

ముఖంపై మచ్చలు ఉన్నాయా.. అయితే ఈ నూనెతో అన్ని మాయం..!!

బాలింతలు చెరుకు రసం తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!!