Home » ఆవిడవల్లే శ్రీదేవి తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిందా…? అసలేం జరిగిదంటే…!

ఆవిడవల్లే శ్రీదేవి తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిందా…? అసలేం జరిగిదంటే…!

by AJAY
Published: Last Updated on
Ad

అతిలోక సుంద‌రి శ్రీదేవి ప‌రిచయం అక్కర్లేని పేరు. ప్ర‌స్తుతం మ‌న మ‌ధ్య‌న శ్రీదేవి లేక‌పోయినా ఆమె చేసిన సినిమాల ద్వారా ఎప్పుడూ ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గని స్థానం సంపాదించుకున్నారు. శ్రీదేవి టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రితోనూ సినిమాలు చేసింది. ఎన్టీఆర్ లాంటి సీనియ‌ర్ హీరోల‌కు జోడీగా న‌టించి ఆ త‌ర‌వాత త‌రంలో చిరంజీవి వెంక‌టేష్ లాంటి హీరోల‌కు సైతం జోడీగా న‌టించారు. కేవ‌లం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాల‌లోనూ న‌టించారు.

Also Read: మ‌హేశ్ బాబు, ర‌మేష్ బాబులు సినిమాల్లోకి రావ‌డానికి ఎన్టీఆర్ సాయ‌ప‌డ్డార‌ని తెలుసా..? ఎలా అంటే…!

Advertisement

 

ఒక‌ప్పుడు స్టార్ హీరోలు శ్రీదేవి కోసం క్యూ క‌ట్టేవారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సైతం శ్రీదేవి డేట్స్ కోసం ఎదురుచూసేవారు. శ్రీదేవి ని చూసేందుకే ప్రేక్ష‌కులు థియేట‌ర్ ల‌కు వెళ్లిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. తెలుగులో బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఆ త‌ర‌వాత బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో న‌టించి బాలీవుడ్ లోనూ అడుగుపెట్టారు.

Also Read:  ఆ త‌ప్పు చేసింద‌ని ఇలియానాను టాలీవుడ్ లో తొక్కేశారా..? తెర‌వెన‌క జ‌రిగిందేంటి..?

Advertisement

తన అందం అభిన‌యం తో బాలీవుడ్ లోనూ శ్రీదేవి స‌త్తాచాటారు. ఇక శ్రీదేవి బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో బాలీవుడ్ దిగ్గ‌జ నిర్మాత బోనీక‌పూర్ తో ఎక్కువ సినిమాలు చేశారు. ఈ క్ర‌మంలో బోణీక‌పూర్ శ్రీదేవిని ప్రేమించారు. అప్ప‌టికే పెళ్లై పిల్ల‌లు ఉన్న‌ప్ప‌టికీ బోణీక‌పూర్ శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నారు. ఈ విష‌యం చాలా మందికి తెలుసు. కానీ శ్రీదేవికి కూడా మొద‌ట వేరే వ్య‌క్తితో వివాహం జ‌రిగింది అన్న‌సంగ‌తి చాలా మందికి తెలియ‌దు.

శ్రీదేవి బాలీవుడ్ లో ఎక్కువగా మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో సినిమాలు చేసింది. అంతే కాకుండా శ్రీదేవి మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో ప్రేమాయ‌ణం కూడా న‌డిపింది. అయితే మిథున్ కు కూడా అప్ప‌టికే వివాహం జ‌రిగింది. మిథున్ భార్య విడాకులు ఇస్తాన‌ని హెచ్చ‌రించ‌డంతో శ్రీదేవిని ప‌క్కన పెట్టి భార్యతోనే ఉండాల‌ని నిర్న‌యించుకున్నాడు. మిథున్ శ్రీదేవి 1985లో సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక మిథున్ తో విడిపోయిన త‌ర‌వాత‌నే శ్రీదేవి బోణీక‌పూర్ ను వివాహం చేసుకుంది.

Also Read: మ‌హేశ్ బాబు, ర‌మేష్ బాబులు సినిమాల్లోకి రావ‌డానికి ఎన్టీఆర్ సాయ‌ప‌డ్డార‌ని తెలుసా..? ఎలా అంటే…!

Visitors Are Also Reading