కొన్ని సినిమాలు ఓపెనింగ్ రోజునే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. ఇక మరికొన్ని సినిమాలు కొద్ది రోజుల తరవాత మెల్లి మెల్లిగా హిట్ టాక్ మొదలవుతుంది. ఇక కొన్ని సినిమాలు అయితే నెగిటివ్ టాక్ తో మొదలై సూపర్ హిట్ టాక్ దిశగా దూసుకువెళతాయి. అలాంటి సినిమా చిరంజీవి కెరీర్ లో కూడా ఒకటి ఉంది. ఆ సినిమా మరేదో కాదు కొండవీటి దొంగ. చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటించగా కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Advertisement
ఈ సినిమా విడుదలైన తరవాత దారుణమైన నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చిరు కెరీర్ లో ఇది లంకేశ్వరుడు సినిమా కంటే పెద్ద ప్లాప్ అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ ఆ తరవాత మెల్లి మెల్లిగా ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్ల వర్షం కురిసింది. మెగాస్టార్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా నిలిచింది.
Advertisement
ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించారు. నిజానికి మొదట ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్ గా అనుకున్నారు. అసలు చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ కోసమే కథను రాసుకున్నారు. మొదట చిరుకు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తరవాత కోదండరామిరెడ్డి శ్రీదేవికి కథను వినిపించారు.
కాగా శ్రీదేవి కథలో మార్పులు చేయాలని చెప్పారు. హీరో రేంజ్ లోనే తన పాత్ర కూడా ఉండాలని అన్నారు. అంతే కాకుండా టైటిట్ కార్డ్ లో హీరో పక్కనే తన పేరును కూడా వేయాలని డిమాండ్ చేశారు. దాంతో మేకర్స్ సినిమాలో శ్రీదేవి స్థానంలో రాధను హీరోయిన్ గా తీసుకున్నారు. అలా తెరెక్కిన కొండవీటి దొంగ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.