శ్రీ రెడ్డి ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏదో ఒక వివాదంతో ఎప్పుడు వార్తల్లో నిలవాలని చూసే వాళ్ళలో శ్రీరెడ్డి కూడా ఒకరు. శ్రీరెడ్డి చేసింది తక్కువ సినిమాలు అయినా వివాదాలతో ఎక్కువ పాపులారిటీని సంపాదించింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని లేవనెత్తి నేషనల్ మీడియాను సైతం ఆకర్షించింది. అంతేకాకుండా టాలీవుడ్ లోని కొంతమంది సెలబ్రిటీలు తనను వాడుకున్నారని ఆరోపిస్తూ రచ్చ లేపింది. ఇక శ్రీరెడ్డి బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని కుంకుదురులో ఓ దిగువ మధ్యతరగతి రెడ్డి కుటుంబంలో జన్మించింది.
READ ALSO : NBK 108 : బాలయ్య సినిమాలో శ్రీ లీల..ఏకంగా ఆ పాత్రలో
ఆమె అసలు పేరు విమల మల్లిడి. శ్రీరెడ్డి తండ్రి వెంకన్న బాబు ఓ బ్రాహ్మణుడిలా ఎప్పుడూ దేవుళ్లకు పూజ, పునస్కారాలు చేస్తూ ఉంటారట. అయితే తెలిసిన వాళ్ళ కారణంగా ఆమె సాక్షిలో యాంకర్ గా సెలెక్ట్ అయ్యింది. అయితే విమల అన్న పేరు బాగోలేదని అక్కడ వాళ్ళు శ్రీ లేక అని పేరు మార్చేశారు. అలా యాంకర్ శ్రీలేఖగా ఆమె పేరు మారింది. ఆ తర్వాత తెలిసిన వాళ్ళు ఆమెను సినిమాలో ట్రై చేయమని చెప్పడం,
READ ALSO : Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!
సినిమా ఆడిషన్స్ కోసం వెళుతున్న క్రమంలోనే కొందరు దర్శక నిర్మాతలు ఆమెను అవకాశాల పేరుతో వాడుకోవడం జరిగింది. అయితే శ్రీరెడ్డి ఇంట్లో ఉన్నప్పుడే ఆమె ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వినకపోవడం, బాగా అల్లరి చేస్తూ ఉండడంతో పాటు గ్లామర్ గా ఉండేందుకు ఇష్టపడడంతో వాళ్ల నాన్న కేవలం 14 ఏళ్లకే ఓ వ్యక్తితో పెళ్లి చేసేసారు. అయితే శ్రీ రెడ్డికి ఈ పెళ్లి, అతనితో కాపురం ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే అతడిని వదిలేసి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ చెక్కేసింది.
READ ALSO : NOKIA : లోగో మార్చిన నోకియా… ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం