Telugu News » Blog » మీ బోడి పెద్దరికం ఎవరిక్కావాలి..పెద్దరికం చేయాలంటే ఆ ఇద్దరే..మెగాస్టార్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

మీ బోడి పెద్దరికం ఎవరిక్కావాలి..పెద్దరికం చేయాలంటే ఆ ఇద్దరే..మెగాస్టార్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!

by AJAY
Ads

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తాను సినిమా ఇండస్ట్రీకి పెద్ద గా వ్యవహరించను అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి సమస్య వస్తే బిడ్డగా ఉంటానని కానీ పంచాయతీలు పరిష్కరించే పెద్దరికం తనకు వద్దని మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారు. ఇక మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా నటి శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీరెడ్డి…. మీ పెద్దరికం ఎవడు అడిగాడు.. బోర్డు పెద్దరికం నాకు అర్థం కాదు. మీకు మీరు పెద్దరికం తీసుకున్నారని వ్యాఖ్యానించింది. ఎక్కడికైనా వెళ్లాలంటే చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వీళ్ళు బయల్దేరి పోతారు.

Advertisement

Advertisement

ప్రొడ్యూసర్ కు వచ్చిన సమస్యలు డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన సమస్యలు, థియేటర్ ఓనర్లకు వచ్చిన సమస్యలు వీళ్ళకేం తెలుసని… ఇద్దరు ముగ్గురు హీరోలకు ఏం తెలుసు అని చర్చలకు వెళతారు అంటూ ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ఎవరైతే పెద్ద నిర్మాతలు అని చెప్పుకుంటున్నారో… ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారో వీళ్ళు ఎవరు పెద్ద మనుషులు కాదని వ్యాఖ్యానించింది. ఎవరు ఇండస్ట్రీ సమస్యలు అర్చనక్కర్లేదు తీర్చనక్కర్లేదు అంటూ మండిపడింది.ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ గా తాను చెప్పేది ఏంటంటే నిర్మాతలకు ఏ సమస్యలు ఉన్నా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు రావాలని తెలిపింది.

Advertisement

Also read : ఏపీలో రేషన్ థియేటర్స్ పెట్టాలి…సినిమాలపై సబ్సిడీ ఇవ్వాలి… ఆర్జీవీ డిమాండ్..!

ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ప్రసన్న కుమార్ గారు చాలా మంచి వ్యక్తి అని ఆయన నిర్మాతల సమస్యలను తీరుస్తారని తెలిపింది. ఎవరైనా హీరోలు ప్రొడ్యూసర్లు తరఫున మాట్లాడాలంటే ప్రసన్న కుమార్ గారి దగ్గర మాట్లాడాలని వ్యాఖ్యానించింది. లేనిపోని పెద్దరికాలకుపోయి ఎక్కడికి వెళ్ళద్దు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. పెద్దరికం చేయాలంటే మోహన్ బాబు, బాలకృష్ణ లకు సూటవుతుందని కానీ మిగతా ఎవ్వరికి సూట్ కాదు అంటూ శ్రీరెడ్డి బాంబు పేల్చింది. మోహన్ బాబు చెప్పిన మాటలకు ఏకీభవిస్తాను అని చిన్న సినిమా నిర్మాతలు థియేటర్ల సమస్యలు ఉంటే అది చిన్న నిర్మాతలకే ఉన్నాయని పేర్కొంది. మోహన్ బాబు చెప్పింది 100% న్యాయం అంటూ శ్రీరెడ్డి వెనకేసుకు వచ్చింది.