Home » IND VS SL : కోహ్లీ కొట్టిన షాట్‌కు ఇద్దరు లంక ప్లేయర్లకు గాయాలు

IND VS SL : కోహ్లీ కొట్టిన షాట్‌కు ఇద్దరు లంక ప్లేయర్లకు గాయాలు

by Bunty
Ad

కొత్త ఏడాదిలో మరో సిరీస్‌ ను గెలిచింది టీమిండియా. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన సిరీస్ ను కైవసం చేసుకుంది. తోలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 390 పరుగులు చేసింది.

Advertisement

దీంతో శ్రీలంకకు 391 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. అయితే చేదనలో శ్రీలంక జట్టు 73 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో టీమ్ఇండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కోహ్లీ శతకం ముంగిట ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడటం అందర్నీ కలవరానికి గురిచేసింది. విరాట్ బాదిన బౌండరీని ఆపే ప్రయత్నంలో, లంక ఫీల్డర్లు వండర్సే, అషెన్ బండారా ఒకరినొకరు ఢీకొట్టారు. కానీ బంతి బౌండరీ లైన్ దాటగా ఫీల్డర్లు ఇద్దరూ గాయపడ్డారు. భారత ఇన్నింగ్స్ 43వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

95 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ, చమిక కరుణరత్నే బౌలింగ్ లో ఆఫ్ పైడ్ షాట్ అడగా, బండారా, వండర్సే ఇద్దరు ఎదురెదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి పరస్పరం ఢీకొట్టారు. దీంతో చాలాసేపు మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. గాయపడిన శ్రీలంక ఆటగాళ్లకు సహాయం చేయడం కోసం భారత ఫీజియో కమలేష్ జైన్ సైతం పరిగెత్తుకుంటూ వెళ్లాడు. బండారా, వండర్సేలను స్కానింగ్ కోసం స్ట్రెచర్ మీద హాస్పిటల్ కు తీసుకెళ్లారు. జెఫ్రీ వండర్సే తలకు దెబ్బతగలడంతో, అతడికి కంకషన్ రీప్లేస్మెంట్ గా దునిత్ వెల్లాలగేను ప్రకటించారు.

READ ALSO : అయ్యో పాపం..మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి !

 

Visitors Are Also Reading