Home » SRH కు బిగ్‌ షాక్‌..తెరపైకి మరో కెప్టెన్‌..నిరాశలో ఫ్యాన్స్‌ ?

SRH కు బిగ్‌ షాక్‌..తెరపైకి మరో కెప్టెన్‌..నిరాశలో ఫ్యాన్స్‌ ?

by Bunty

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. అయితే, ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలకు ఓ బ్యాడ్ న్యూస్. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభం మ్యాచుల్లో ఆడే అవకాశాలు కల్పించడం లేదు.

READ ALSO : నవీన్ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన హరిహార కృష్ణ ప్రియురాలు !

దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నెదర్లాండ్స్ తో రెండు మ్యాచ్ ల రీషెడ్యూల్ వన్డే సిరీస్ ఆడనుండడమే దీనికి కారణం. కాగా ఈ సిరీస్ లో తమ జట్టు స్టార్ ఆటగాళ్లను భాగం చేయాలని దక్షిణాఫ్రికా క్రికెట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే తమ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బీసీసీఐకు కూడా తెలియజేసినట్లు సమాచారం.

READ ALSO :  12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

 

ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కాంట్రాక్టు కలిగి ఉన్న కగిసో రబడ, లుంగీ ఎంగిడి, రాస్సీ వాన్ డేర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, ఐడెన్ మార్కరం, స్టాబ్స్, మార్కో జాన్సన్, క్లాసన్ వంటి ప్రోటీస్ ఆటగాళ్లు నెదర్లాండ్స్ తో వచ్చే సిరీస్ లో భాగమయ్యే ఛాన్స్ ఉంది. కాగా ప్రోటీస్ స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్కరమ్ సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ లో SRH తమ తొలి మ్యాచ్ లో ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో తెలపడనుంది. ఈ మ్యాచ్ కు మార్కరమ్ దూరం కావడం దాదాపు కాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో SRH కెప్టెన్ గా వెటరన్ పెసర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించే అవకాశం ఉంది.

READ ALSO : “రైటర్ పద్మభూషణ్” ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే !

Visitors Are Also Reading