టీమ్ ఇండియా వివాదస్పద బౌలర్, కేరళ క్రికెటర్ శాంతకుమారన్ నాయర్ శ్రీశాంత్ (39) క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. టీమిండియా ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవమని.. ఆ స్థాయికి చేరేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు జట్టు సహచరులకు శ్రేయాభిలాషులకు ధన్యవాదాలంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని చాలా బాధతో బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నానని తెలిపాడు. యువతరానికి అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించాడు.
Advertisement
Advertisement
క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సరైన సమయం ఇదేనని అభిప్రాయపడ్డాడు. బాగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. ఇది తన వ్యక్తిగతం అని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరుపున 27 టెస్ట్‌లు 53 పడగొట్టాడు. ఈ వెటరన్ పేసర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగావేలంలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఏ జట్టు అతనిపై ఆసక్తి కనబరచడంతో అమ్ముడుపోని క్రికెటర్ల జాబితాలో మిగిలిపోయాడు. శ్రీశాంత్ 50 లక్షల బేస్.. ప్రైజ్ విభాగంలో మెగా వేలంలో పేరును నమోదు చేసుకున్నాడు.
Advertisement
Also Read : Russia-Ukraine War: రష్యాకు ఎదురు దెబ్బ.. ఐఓసీ బహిష్కరణ వేటు..!