Home » నువ్వు అప్పుడే పరిచయం అయ్యావ్ థాంక్యూ డియర్ అంటూ శ్రీజ పోస్ట్… నెట్టింట వైరల్…!

నువ్వు అప్పుడే పరిచయం అయ్యావ్ థాంక్యూ డియర్ అంటూ శ్రీజ పోస్ట్… నెట్టింట వైరల్…!

by AJAY
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ అంటే పరిచయం అక్కర్లేదు. శ్రీజ తరచూ వార్తల్లో నిలవడం వల్ల ప్రేక్షకులకు గుర్తు ఉండి పోయింది. శ్రీజ మొదట భరద్వాజ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బయటకు వెళ్లి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల తర్వాత వారికి కూతురు పుట్టింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం తో విడిపోయారు.

SREEJA INTO BIGG BOSS OTT

Advertisement

ఆ తరవాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆ పెళ్లి జరిపించారు. వీరికి కూడా ఓ పాప పుట్టింది. అయితే ఏం జరిగిందో కానీ శ్రీజ కళ్యాణ్ దేవ్ దూరంగా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా టాక్.

Advertisement

ఇప్పటికే శ్రీజ కళ్యాణ్ దేవ్ ఫోటోలను సైతం తన సోషల్ మీడియా నుండి డిలీట్ చేసింది. అంతే కాకుండా తరచూ ఎమోషనల్ పోస్ట్ లను షేర్ చేస్తోంది. ఇక తాజాగా శ్రీజ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కాఫీ అలవాటు గురించి పోస్ట్ పెట్టిన శ్రీజ ఆ పోస్ట్ లో….నా అల్లరికి ప్రశాంతతవు నువ్వే ఇస్తావు….జీవితంలో చీకటికి వెలుగులు నువ్వే నింపుతావు.

నేను ఉదయం లేస్తున్నా అంటే దానికి కారణం నువ్వే…..14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నాకు నువ్వు పరిచయం అయ్యావ్. అప్పటి నుండి నాతోనే ఉంటున్నావ్..థాంక్స్ మై డియర్ అంటూ శ్రీజ తన పోస్ట్ లో పేర్కొంది.

ALSO READ : Ananta Sriram : వివాదంలో ఇరుక్కున్న అనంత్ శ్రీరామ్, ఆ కులస్తులను అవమానించారని..

Visitors Are Also Reading