Home » ఏడిస్తే ఓదార్చారు… న‌వ్వితే సంతోష‌ప‌డ్డారు అంటూ శ్రీజ ఎమోష‌న‌ల్..!

ఏడిస్తే ఓదార్చారు… న‌వ్వితే సంతోష‌ప‌డ్డారు అంటూ శ్రీజ ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా చాలా మందికి తెలుసు. శ్రీజ కాలేజీలో చదువుకుంటున్న సమయం లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతే కాకుండా ఆ సమయం లో తన కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేస్తున్నారని తనకు తన భర్తకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కారు.

Advertisement

వీరిద్దరికీ ఓ కుమార్తె ఉండగా కొంతకాలం తర్వాత మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాలాకాలం పాటు శ్రీజ ఒంటరిగానే ఉన్నారు. ఈ క్రమంలో చిరంజీవి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో శ్రీజ వివాహం జరిపించారు. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు శ్రీజా కళ్యాణ్ కలిసి ఉన్నారు. వీరిద్దరికీ కూడా ఓ కుమార్తె పుట్టింది.

SREEJA INTO BIGG BOSS OTT

Advertisement

ఇదిలా ఉంటే గత ఏడాదికాలంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం కళ్యాణ్ దేవ్ సినిమాలకు మెగా ఫ్యామిలీ నుండి సపోర్ట్ లభించడం లేదు. అంతేకాకుండా శ్రీజ తన సోషల్ మీడియా నుండి కళ్యాణ్ దేవ్ ఫోటోలను డిలీట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ విడిగా ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్ సినిమాల‌లో న‌టిస్తుండ‌గా శ్రీజ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు.

Ramcharan sreeja kalyan

Ramcharan sreeja kalyan

అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. కాగా గతంలో శ్రీజ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీజ తన సోషల్ మీడియాలో….. కష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అండగా నిలిచారు. నేను ఏడిస్తే ఓదార్చారు. నేను మాట్లాడేటప్పుడు విన్నారు. నవ్వితే సంతోషించారు. అంటూ పేర్కొన్నారు. కళ్యాణ్ దేవ్ తో విడాకుల వల్లే శ్రీజ ఇలా ఎమోషనల్ పోస్ట్ చేసింది అంటూ నెటిజ‌న్లు అభిప్రాయపడ్డారు.

ALSO READ : నందమూరి కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే !

Visitors Are Also Reading