Home » రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచిన పెళ్లి సంద‌డి బ్యూటీ…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచిన పెళ్లి సంద‌డి బ్యూటీ…ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ad

హీరో శ్రీకాంత్ వారుసుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రోష‌న్. రీసెంట్ గా రోషన్ పెళ్లి సంద‌డి సినిమాతో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక రాఘ‌వేంద్ర‌రావు సినిమాల్లో హీరోయిన్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి ఈ సినిమాలో కూడా అంద‌గ‌త్తె శ్రీలీల‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అప్ప‌టికే క‌న్న‌డలో సినిమాలు చేసిన శ్రీలీల‌కు ఇదే మొద‌టి సినిమా కాగా మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకుంది.

Advertisement

Advertisement

అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంది. డ్యాన్స్ లోనూ గ్లామ‌ర్ హొయ‌లు చూపిస్తూ మెప్పించింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత శ్రీలీల‌కు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే ర‌వితేజ న‌క్కిన త్రినాధ‌రావు కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లోనే అమ్మ‌డికి మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో త‌న రెమ్యున‌రేష‌న్ ను శ్రీలీల భారీగా పెంచేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 1కోటి వ‌ర‌కూ డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading