Home » మ‌హేష్ త్రివిక్ర‌మ్ సినిమాలో కుర్ర హీరోయిన్..!

మ‌హేష్ త్రివిక్ర‌మ్ సినిమాలో కుర్ర హీరోయిన్..!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన పూజా కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజా హెగ్డే, నమ్రత హాజరయ్యారు. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూడో సినిమా గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం…. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

సినిమాలో సెకండ్ లీడ్ రోల్ కోసం చిత్ర యూనిట్ పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా శ్రీలీల‌ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తోంది. రవితేజ రవితేజతో పాటు నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ చూస్తుంటే త్వ‌ర‌లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయేలా ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Visitors Are Also Reading