Home » “ఢీ” డ్యాన్స్ షో కోసం శ్ర‌ద్దాదాస్ రోజుకి అంత తీసుకుంటుందా…? సినిమాల‌కు మించి..!

“ఢీ” డ్యాన్స్ షో కోసం శ్ర‌ద్దాదాస్ రోజుకి అంత తీసుకుంటుందా…? సినిమాల‌కు మించి..!

by AJAY
Ad

ఒక‌ప్పుడు హీరోయిన్ లు బుల్లితెర‌పై క‌నిపించేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్ గా కాస్త గ్యాప్ వ‌చ్చిందంటే చాలు బుల్లితెర‌పై క‌న్నేస్తున్నారు. అవ‌కాశం ఉన్న‌ప్పుడే డ‌బ్బులు సంపాదించుకోవాల‌ని చూస్తున్నారు. టీవీ షోల‌లో జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తూ బుల్లితెర అభిమానుల‌తో పాటూ చేతి నిండా సంపాదిస్తున్నారు. ఇప్ప‌టికే అలా చాలా మంది స‌క్సెస్ అయ్యారు.

Advertisement

ఇక‌ ఆ లిస్టులో హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ కూడా ఇప్పుడు చేరిపోయారు. శ్ర‌ద్దాదాస్ హీరోయిన్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు. అంతే కాకుండా స్పెష‌ల్ సాంగ్ ల‌తోనూ అల‌రించారు. ఇప్ప‌టికీ కూడా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బుల్లితెర‌పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. శ్ర‌ద్దా దాస్ ఢీ డ్యాన్స్ షోలో న్యాయ‌నిర్నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

గతంలో హీరోయిన్ స‌దా జ‌డ్జిగా వ్య‌హ‌రించి ఆక‌ట్టుకున్నారు. ఇక శ్ర‌ద్దా దాస్ విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు ఢీ షోలో చేసేందుకు భారీ రెమ్యున‌రేషన్ ను డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. శ్ర‌ద్దాదాస్ ఢీ షోలో చేసేందుకు సినిమాల్లో రేంజ్ లోనే పుచ్చుకుంటున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

ఆ టాక్ ప్ర‌కారంగా ఈ బ్యూటీ ఒక్క రోజుకు రూ.3.5 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ను అందుకుంటుంద‌ట‌. ఇక ఢీ షో చాలా రోజుల పాటూ ప్ర‌సారం అవుతుంది కాబ‌ట్టి శ్ర‌ద్దాదాస్ కు వ‌ర్కౌట్ అవుతుంద‌ని నెటిజ‌న్ లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతే కాకుండా టీవీ లో స‌క్సెస్ అయితే ఇక్క‌డ కూడా సినిమాల రేంజ్ లోనే సంపాదించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి శ్ర‌ద్దాదాస్ గ్లామ‌ర్ ఢీ షోకు ఏమేర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.

Visitors Are Also Reading