Home » ఆ స్టార్ హీరోయిన్ విషయం లో సీనియర్ ఎన్టీఆర్ చెప్పించిన జాతకమే నిజమయ్యిందట..! ఇంతకీ ఎవరా హీరోయిన్..?

ఆ స్టార్ హీరోయిన్ విషయం లో సీనియర్ ఎన్టీఆర్ చెప్పించిన జాతకమే నిజమయ్యిందట..! ఇంతకీ ఎవరా హీరోయిన్..?

by AJAY

సినిమాలపై ఉన్న అమితమైన ప్రేమతో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీ రామారావు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. తనదైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నారు. టాలెంట్ తో పాటు క్రమశిక్షణ ఉండటం వల్లనే ఎన్టీఆర్ ఆ స్థాయికి చేరుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇక ఎన్టీఆర్ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించిన సంగతి తెలిసిందే.

Sr.Ntr

Sr.Ntr

అయితే శ్రీదేవి ఎన్టీఆర్ ల జోడి మాత్రం అప్పట్లో ప్రతి ఒక్కరికి ఫేవరెట్ గా మారిపోయింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వేటగాడు, కొండవీటి సింహం బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు సహా పలు చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే నిజానికి శ్రీదేవి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని ఎన్టీఆర్ ముందుగానే ఊహించారట.

అంతేకాకుండా అప్పటి దర్శకుడు విఠలాచార్య జాతకాలు చూసి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పేవారు. ఎన్టీఆర్ జాతకాన్ని చూసిన విఠలాచార్య నువ్వు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతావని ముందే చెప్పారట. ఇక ఎన్టీఆర్ శ్రీదేవి జాతకాన్ని చూడాలని విఠలాచార్య తో చెప్పారట. దాంతో విఠలాచార్య శ్రీదేవి జాతకం చూసి శ్రీదేవి దేశంలోనే టాప్ హీరోయిన్ గా ఎదుగుతుందని చెప్పారట.

విఠలాచార్య చెప్పిన విధంగానే శ్రీదేవి చిన్న వయసులోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ రాణించింది. ఆ తరవాత బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ ను వివాహం చేసుకుని ముంబై లోనే సెటిల్ అయ్యింది. శ్రీదేవి బతికున్న సమయంలో అనేక ఇంటర్వ్యూలలో తనకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading