నందమూరి ఫ్యామిలీ అంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. వారి ఫ్యామిలీ పేరు తారాస్థాయిలో నిలవడానికి ప్రధాన కారణం అన్న నందమూరి తారకరామారావు అని చెప్పవచ్చు. అంతటి గొప్ప పేరు ఉన్న ఈ వ్యక్తి కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలిగారు. కానీ ఈయన తర్వాత ఆయన వారసులు ఎవరు అంతటి పేరు సంపాదించుకోలేకపోతున్నారు. ఇందులో ఆయన నట రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్న ఏకైక హీరో బాలకృష్ణ. ఆయన ఓవైపు సినిమాల్లో రాణిస్తూ మరోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు.కానీ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులు ఎవరు కూడా ఇంత స్థాయిలో పేరు సంపాదించుకోవడంలో సక్సెస్ కాలేకపోయారని చెప్పవచ్చు.
also read:రిలీజ్ కి ముందే ‘ది కేరళ స్టోరీ’ సంచలనం.. వివాదం ఎందుకంటే ?
Advertisement
also read:KV రెడ్డి To జక్కన్న వరకు: ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన దర్శకుల లిస్ట్..!!
Advertisement
ఇక బాలకృష్ణ కు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తిగా పేరుంది. హరికృష్ణ,పురందేశ్వరి వంటి వారు కొంతమేర రాజకీయాలను అర్థం చేసుకున్నా కానీ పూర్తిస్థాయిలో నిలువలేక పోయారు. ఇక ఆయన మనవళ్ళ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ బాగానే దూసుకుపోతున్నారు. కానీ ఇంత పెద్ద కుటుంబంలో సినిమా రంగంలో ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్నారు కానీ వీరందరి కంటే అత్యధికంగా వ్యాపార రంగంలో పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి నారా బ్రాహ్మణి.
ఆమె ఓవైపు నారా కుటుంబానికి మరోవైపు నందమూరి కుటుంబానికి ఒక ఆశాజ్యోతి గా నిలుస్తోంది. ఇప్పటికే ఆమె హెరిటేజ్ సంస్థల వ్యాపార రంగంతో పాటుగా క్యాన్సర్ ఆసుపత్రి మరియు ట్రస్ట్ బోర్డుకి మెంబర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది. ఆమె స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడకుండా ఇండియాకు వచ్చి తండ్రి చెప్పినట్టు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ని పెళ్లి చేసుకుని మామ వ్యాపారం చూసుకుంటోంది. ఈ విధంగా దేశంలోనే యువ వ్యాపారవేత్తగా ఆమె దేశమంతా తిరుగుతూ వారి వ్యాపారాన్ని విస్తరిస్తూ వారి కుటుంబం పేరు నిలబెడుతోంది.
also read:జెమినీ గణేశన్ కు కొంతమంది టాలీవుడ్ వాళ్లు శత్రువులుగా ఉండటానికి కారణం అదేనా ?