తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. దాదాపు 6 దశాబ్దాలకు పైగానే ఈ ఫ్యామిలీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికే మూడోతరం హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే ఎన్టీఆర్ గారికి మొత్తం 12 మంది సంతానం. వీరిలో 8 మంది మగ పిల్లలు. నలుగురు ఆడపిల్లలు. ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ స్వర్గస్తులయ్యారు.
READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…
Advertisement
వీరిలో రామకృష్ణ… ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూశారు. మిగతా ఇద్దరూ తర్వాత స్వర్గస్తులయ్యారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ మనవడు తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ చిన్న వయసులోనే దాదాపు దేశంలోని పుణ్యక్షేత్రాలు చుట్టివచ్చారు. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించే రామకృష్ణ కేవలం 17 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు.
Advertisement
READ ALSO : IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?
ఆయన మృతిని ఎన్టీఆర్ అస్సలు తట్టుకోలేకపోయారు. రామకృష్ణ ఓసారి తన నానమ్మ, తాతయ్యలతో కలిసి నిమ్మకూరు వెళ్ళాడు. అక్కడే రామకృష్ణ మసూచి వ్యాధి బారిన పడగా ఆ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశాడు. రామకృష్ణ చనిపోయిన రోజు ఎన్టీఆర్ ఇరుగు పొరుగు అనే సినిమా షూటింగ్ లో ఉండగా, షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మేకప్ గదిలోకి వెళ్లి మేకప్ తీసేసిన తర్వాత బోరున ఏడ్చేశారట.
READ ALSO : కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?