Home » Spy Movie Review : ‘స్పై’ మూవీ రివ్యూ..నిఖిల్ ఖాతాలో మరో హిట్ ?

Spy Movie Review : ‘స్పై’ మూవీ రివ్యూ..నిఖిల్ ఖాతాలో మరో హిట్ ?

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కార్తికేయ 2’ రిలీజ్ తర్వాత నిఖిల్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. రొటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో స్పై మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నిఖిల్. యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన స్పై సినిమాకు గ్యారి బిహెచ్ దర్శకత్వం వహించగా… ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.

Advertisement

కథ మరియు వివరణ :

హీరో నిఖిల్ నటించిన స్పై మూవీ కథలోకి వెళితే… జై (నిఖిల్) శ్రీలంకలో పనిచేసే రా ఏజెంట్. హత్యకు గురైనట్లు భావిస్తున్న ఖదీర్ ఖాన్ అనే ఉగ్రవాది మళ్ళీ తెరపైకి వచ్చి ప్రధాని కార్యాలయానికి ఈ వీడియో పంపిన తర్వాత అతనికి తీవ్రవాద కార్యకలాపాల గురించి తెలియజేయబడుతుంది. జై ఇప్పుడు ఖదీర్ ను పట్టుకునే లక్ష్యంతో ఉంటాడు. ఈ ప్రక్రియలో అతను ఈ ప్రత్యేక ఉగ్రవాది కారణంగా తాను అనుభవించాల్సిన వ్యక్తిగత నష్టాన్ని తెలుసుకుంటాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి ఈ మిషన్ ఎలా సంబంధం కలిగి ఉంది. ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

నిఖిల్ నటించిన స్పై సినిమా చాలా బాగుంది. వాళ్లు వీళ్లు చెబుతున్నారని కాదు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా. నిఖిల్ యాక్టింగ్ బాగుంది. రాజకీయం బాగుంది. దానితో ఎలా మోసపోతారో చూపించారు. పాన్ ఇండియా హిట్ అవుతుంది. ఈ సినిమా లేడీ ఫ్యాన్స్ కు బాగా రీచ్ అవుతుంది. అయితే ఈ సినిమా లొకేషన్లకు తగ్గ విజువల్స్ అద్భుతంగా లేవని చెప్పుకోవాలి. మరో విషయం ఏంటంటే… స్పై మూవీ లో నిఖిల్ తప్పించి… మిగతా నటీనటులు అందరూ పెద్దగా ఉపయోగపడలేదు. నిఖిల్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. నిఖిల్ టీమ్ అంతా సపోర్ట్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేదని చెబుతున్నారు.

పాజిటివ్ పాయింట్స్ :

నిఖిల్
కథ
మ్యూజిక్

నెగిటివ్ పాయింట్స్ :

ల్యాగ్ సీన్స్
విజువల్స్

రేటింగ్ – 2.75/5

ట్యాగ్ లైన్ – వన్ మ్యాన్ షో

ఇవి కూడా చదవండి

Samajavaragamana Review : ”సామజవరగమన” మూవీ రివ్యూ

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?

Visitors Are Also Reading