Home » వ్యాధులు, బాధలు దూరమయ్యేందుకు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ?

వ్యాధులు, బాధలు దూరమయ్యేందుకు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ?

by Bunty
Ad

ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక మనిషి శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగానూ, ఆర్థికంగాను తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి. మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. అయితే, ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు వీటన్నింటి కారణంగా జబ్బులు, వ్యాధులు, బాధలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.

Advertisement

డబ్బు లేని వాళ్ళు కనిపిస్తారేమో గానీ, జబ్బు లేని వాళ్ళు మాత్రం కనిపించరన్నది వాస్తవం. ఏ జబ్బు ఏ వైద్యుల హస్తవాసితో తగ్గిపోతుందన్నది చెప్పలేం. కొన్ని జబ్బులు ఎంతమంది వైద్యుల వద్దకు తిరిగిన నయం కావు. అలాంటివి కొన్ని క్షేత్రాలను దర్శించుకొని ప్రగాఢమైన విశ్వాసంతో, సంపూర్ణమైన భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే తగ్గిపోతాయి. ఇలాంటి సంఘటనలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. అలాంటి దైవాల్లో ఒకరు విమలాదిత్యుడు. ఈ దైవాన్ని ఎక్కడ దర్శించుకోవచ్చు, ఈ దైవానికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం.

Advertisement

కాశీ క్షేత్రానికి వెళ్లాలనే ఆలోచన చేయగానే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్య భగవానుడు కొలువైన 12 ఆలయాలు కనిపిస్తాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలవబడుతూ పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలాంటి వారిలో ‘విమలాదిత్యుడు’ కొలువైన ఆలయం ఒకటి. పూర్వం ‘విమలుడు’ అనే రాజు కుష్టు వ్యాధితో బాధపడుతుండేవాడు. దాంతో జీవితం పట్ల విరక్తితో ఆయన భార్యాబిడ్డలను వదిలి కాశీ క్షేత్రానికి చేరుకున్నాడు. ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్య భగవానుడు ప్రత్యక్షమై, కుష్టు వ్యాధి నుంచి విముక్తుడిని చేశాడు. విమలుడు ప్రతిష్టించిన మూర్తి విమలాదిత్యడు పేరుతో పూజలు అందుకుంటుందని సెలవిచ్చాడు. విమలాదిత్యుడిని పూజించిన వారికి వ్యాధులు, బాధలు, దారిద్య దుఃఖాలు ఉండవని తెలిపాడు. అందువల్ల కాశీ క్షేత్రానికి వెళ్ళిన వారు ఇక్కడి సూర్య దేవాలయాలను తప్పనిసరిగా దర్శించుకుంటారు.

 

Visitors Are Also Reading