Telugu News » ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారి ఫామిలీ ఫొటోస్

ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారి ఫామిలీ ఫొటోస్

by Anji

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి చెందార‌నే వార్త విన‌గానే యావ‌త్ సినీ ప్ర‌పంచాన్ని శోక‌సంద్రంలో ముంచేసింది. దాదాపుగా 40 రోజులుపైగా క‌రానాతో పోరాడి చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో మృతి చెందారు. ఆగ‌స్టు తొలి వారం నుంచి ఆయ‌న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌టి నుంచి రోజుకొక వార్త వినిపించింది.

Ads

Also Read: త‌న సంపాద‌న‌తో ఇల్లు కొన్న అవినాష్‌.. ఎలా ఉందంటే..?

spb-photos

spb-photos

ముఖ్యంగా ఆయ‌న ఆరోగ్యం విష‌మించింద‌ని ఒక‌రోజు.. మ‌రొక రోజు ఆయ‌న కోలుకున్నార‌ని ఇలా ప‌లుమార్లు ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపించాయి. ఆయ‌న మ‌ర‌ణ వార్త వినగానే పెద్ద షాక్ త‌గిలింద‌నే చెప్ప‌వ‌చ్చు. అభిమాన గాయ‌కుడు ఇక లేడ‌నే విష‌యాన్ని ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

Sp Balu Family Photos

Sp Balu Family Photos

 

1946 జూన్ 04న ఉత్త‌ర ఆర్కాడు జిల్లాలోని కోనేట‌మ్మ‌పేట గ్రామంలో ఒక సాంప్ర‌దాయ శైవ బ్రాహ్మ‌ణ కుటుంబంలో బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం జ‌న్మించారు. ఈయ‌న తండ్రి హ‌రిక‌థ క‌ళాకారుడు కావ‌డంతో బాలుకు చిన్ననాటి నుంచే సంగీతం ప‌ట్టు ఎంతో ఆస‌క్తి పెర‌గింది. మ‌ద్రాస్‌లో ఇంజినీరింగ్ చ‌దువు పూర్తి చేశాడు. ఆ స‌మ‌యంలోనే స్టేజీ పై పాట‌లు పాడ‌టం అల‌వాటు చేసుకున్నారు. 1966లో ప‌ద్మ‌నాభం నిర్మాణంలో వ‌చ్చిన శ్రీ‌శ్రీ‌మ‌ర్యాద రామ‌న్న చిత్రంలో సింగ‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు బాలు. ఆయ‌న టాలెంట్ చూసి అవ‌కాశాలు ఆటోమెటిక్‌గా వ‌చ్చాయి. ఆత‌రువాత ఆయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లోని ప‌లు సినిమాల‌లో ఆయ‌న పాట‌లు పాడారు.

Also Read: హీరోయిన్ తో స్టార్ హీరో తనయుడి ప్రేమాయ‌ణం.. ఫొటోలు వైర‌ల్‌..!

Sp Balu Family Photos

Sp Balu Family Photos

ర‌జ‌నికాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, స‌ల్మాన్‌ఖాన్‌, విష్ణువ‌ర్థ‌న్‌, జెమిని గ‌ణేశ‌న్‌, గిరిష్ క‌ర‌నాడ్‌, అర్జున్‌, న‌గేష్‌, ర‌ఘువ‌ర‌న్ లాంటి ఎంద‌రో స్టార్ల‌కు డ‌బ్బింగ్ చెప్పారు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. న‌టునిగా కూడా అద్భుత‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. ఇక బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికొస్తే.. ఆయ‌న భార్య పేరు సావిత్రి. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం క‌ల‌రు. కొడుకు చ‌ర‌ణ్ సింగ‌ర్‌గా అంద‌రికీ పరిచ‌య‌మే. బాలు కుమార్తె ప‌ల్ల‌వి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సోద‌రి శైల‌జ కూడా పాపుల‌ర్ సింగ‌ర్ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈమె ప్ర‌ముఖ న‌టుడు శుభ‌లేఖ సుధాక‌ర్‌ను పెళ్లి చేసుకున్న‌ది. బాలు ఫ్యామిలీ గురించి బ‌య‌ట ఎక్కువ‌గా వార్తలు వ‌చ్చేవి కావు. ముఖ్యంగా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అవి చూసేద్దాం.

Sp Balu family photos and Images

Sp Balu family photos and Images

Sp Balu family photos and Images

Sp Balu family photos and Images

 


You may also like