Home » సానియా మిర్జాతో విడాకులు…? అస‌లు విష‌యం చెప్పిన షోయ‌బ్ మాలిక్..!

సానియా మిర్జాతో విడాకులు…? అస‌లు విష‌యం చెప్పిన షోయ‌బ్ మాలిక్..!

by AJAY
Ad

టెన్నిస్ స్టార్ సానియా మిర్జా 2010వ‌ సంవత్సరంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. షోయ‌బ్ మాలిక్ సానియా దంపతులకు ఇషాన్ మిర్జా మాలిక్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొద్దిరోజులుగా ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై షోయబ్ మాలిక్ స్పందించారు.

Advertisement

షోయ‌బ్ మాలిక్ మాట్లాడుతూ….ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అని స్పష్టం చేశారు. అంతేకాకుండా విడాకుల అంశంపై తాను గాని… తన భార్య సానియా మీర్జా గాని ఎలాంటి సమాధానం చెప్పబోమని అన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని వెల్లడించారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ నటి ఆయేషా తో షోయ‌బ్ మాలిక్ సన్నిహితంగా ఉండడం వల్లే సానియా మీర్జా తో గొడ‌వ‌లు వచ్చాయని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వీరి సన్నిహిత వర్గాలు గతంలోనే విడాకులు వచ్చేసాయని చెబుతున్నాయి.

Advertisement

మరోవైపు సోషల్ మీడియాలో సానియా మీర్జా పెడుతున్న కొన్ని పోస్టులు కూడా విడాకుల ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే విడాకులపై మాత్రం సానియా మీర్జా ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. దాంతో ఇద్దరూ అసలు విడాకులు తీసుకున్నారా లేదా అన్నది ఇప్ప‌టికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పుడేమో షోయ‌బ్ మాలిక్ అది త‌మ ప‌ర్స‌న‌ల్ విష‌యం అని తాము స్పందించ‌మ‌ని చెబుతున్నారు. అయితే ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలంటే మాత్రం ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు క్లారిటీ ఇవ్వాల్సిందే.

Visitors Are Also Reading