Home » ద‌క్షిణకొరియాలో క‌రోనా క‌ల‌క‌లం..ఒక్క‌రోజే 6ల‌క్ష‌లపైగా కేసులు న‌మోదు

ద‌క్షిణకొరియాలో క‌రోనా క‌ల‌క‌లం..ఒక్క‌రోజే 6ల‌క్ష‌లపైగా కేసులు న‌మోదు

by Anji
Ad

ద‌క్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ క‌రోనా కేసులు ఊహించ‌ని స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 6,21,328 క‌రోనా నూత‌న కేసులు వెలుగు చూసాయి. ఒక్క రోజుల్లోనే కేసుల సంఖ్య ఏకంగా 55 శాతం పెరిగిన‌ట్టు కొరియా వ్యాధి నియంత్ర‌ణ, నివార‌ణ సంస్థ కేడీసీఏ వెల్ల‌డించిన‌ది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 82ల‌క్ష‌లకు చేరిన‌ది.


ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ద‌క్షిణ కొరియాలో మొద‌టిసారి ఐదు అంకెల కేసులు న‌మోదు అయ్యాయి. అప్ప‌టి నుంచి వైర‌స్ ఉధృతి క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. మార్చి 09న తొలిసారిగా కేసుల సంఖ్య 3ల‌క్ష‌ల మార్కు దాట‌గా వారం రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. ఇదే స‌మ‌యంలో మ‌ర‌ణాలు కూడా భారీగానే న‌మోద‌వుతున్నాయి. తాజాగా 429 మంది వైర‌స్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌రోజులో ఈ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు అవ్వ‌డం ఇదే మొద‌టిసారి అని కేడీసీఏ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Advertisement

ముఖ్యంగా ద‌క్షిణ‌కొరియాలో కేసుల పెరుగుద‌ల‌కు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పాటు దేశంలో క‌రోనా ఆంక్ష‌ల స‌డ‌లింపే కార‌ణం. వైర‌స్ ఉదృతి పెరుగుతున్నా.. కొరియాలో మ‌రొక‌సారి క‌ఠిన ఆంక్ష‌లు విధించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. మ‌రొక‌వైపు ఉన్న వాటిని మ‌రింత స‌డ‌లించాల‌ని కొరియా ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. చిన్న వ్యాపారాలు, స్వ‌యం ఉపాధి బృందాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేప‌థ్యంలోని కొన్ని ఆంక్ష‌ల‌ను ఎత్తేసే అంశంపై ప్ర‌భుత్వం శుక్ర‌వారం నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. క‌రోనా విజృంభ‌ణ‌ను అరిక‌ట్టేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలని.. ద‌క్షిణ కొరియా ప్ర‌ధాని కిమ్ బూ క్యూమ్ అధికారుల‌ను ఆదేశించారు.

Also Read :  విడాకుల త‌ర‌వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌…ఏం చేసిందంటే..!

Visitors Are Also Reading