Home » బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలను మిస్ చేసుకున్న‌ సౌత్ ఇండియన్ స్టార్లు వీళ్లే..!

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలను మిస్ చేసుకున్న‌ సౌత్ ఇండియన్ స్టార్లు వీళ్లే..!

by AJAY
Ad

సౌత్ ఇండియన్ సినిమాల ఆఫ‌ర్లు వ‌స్తే బాలీవుడ్ న‌టీన‌టులు వ‌దులుకోవ‌డం కామ‌నే..కానీ బాలీవుడ్ ఆఫ‌ర్ ల‌ను ప‌క్క‌న పెట్టిన సౌత్ ఇండియ‌న్ స్టార్ లు కూడా ఉండ‌టం చెప్పుకోద‌గ్గ విష‌యం. అలా బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సినిమాల ఆఫ‌ర్ ను వ‌దులుకున్న న‌టీన‌టులు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

rashmika2

rashmika

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది. అయితే ర‌ష్మిక‌కు బాలీవుడ్ లో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్న జెర్సీ సినిమాలో హీరోయిన్ గా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. కానీ ర‌ష్మిక ఆ సినిమా చేసేందుకు నో చెప్పింద‌ట‌.

Advertisement

vijay dewarakonda

vijay dewarakonda

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సైతం ప‌లు బాలీవుడ్ ఆఫ‌ర్ లు వ‌చ్చాయ‌ట‌. కానీ స్క్రిప్ట్ లు న‌చ్చ‌కపోవ‌డంతో వాటిని తిర‌స్క‌రించాడ‌ట‌. ఇక ప్ర‌స్తుతం బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తో రౌడీ హీరో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ALLU ARJUN

ALLU ARJUN

రీసెంట్ గా పుష్ప సినిమా పాన్ ఇండియా స్టార్ గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా బ‌జ‌రంగీ బాయ్ జాన్ ఆఫర్ వ‌చ్చింద‌ట‌. కానీ బ‌న్నీ ప‌క్క‌న పెట్టాడ‌ట‌.

Advertisement

Anushka Shetty

Anushka Shetty

బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న బ్యూటీ స్వీటీ అనుష్క‌. అయితే అజ‌య్ దేవ్ గ‌న్ హీరోగా న‌టించిన సింగం నినిమా ఆఫ‌ర్ అనుష్క‌కు వ‌చ్చింద‌ట‌. కానీ అనుష్క తిర‌స్క‌రించ‌డంతో ఆ ప్లేస్ లో కాజ‌ల్ న‌టించింది.

mahesh

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు త‌మ ఫేవ‌రెట్ అంటూ ప‌లువురు భాలీవుడ్ భామ‌లు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా మ‌హేశ్ కు ప‌లు బాలీవుడ్ ఆఫ‌ర్ లు కూడా వ‌చ్చాయ‌ట‌. కానీ త‌న‌కు టాలీవుడ్ లో సినిమాలు చేయ‌డ‌మే ఇష్ట‌మ‌ని వాటిని రిజెక్ట్ చేశాడ‌ట‌.

మ‌ల‌యాళ హీరో నివిన్ పౌల్ ప్రేమ‌మ్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. కాగా నివిన్ కు అనురాగ్ క‌శ్య‌ప్ తెర‌కెక్కించిన మ‌న్మ‌జ‌రియ‌న్ సినిమాలో విక్కీ కౌష‌ల్ రోల్ చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. కానీ ఈ హీరో నో చెప్పాడ‌ట‌.

also read : హిజ్రాల చ‌ప్ప‌ట్లు ఎందుకు భిన్నంగా ఉంటాయి…చ‌ప్ప‌ట్ల వెన‌క ఉన్న సీక్రెట్ ఏంటి…!

Visitors Are Also Reading