సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ లు సక్సెస్ అయ్యారు. అయితే ఎంత మంది ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు అంటే వేళ్లపైనే లెక్కపెట్టవచ్చు. సావిత్రి చిత్రసీమలో హీరోయిన్ గా చెరగని ముద్రవేసుకుంది. అదే విధంగా చిన్న వయసులోనే కన్నుమూసిన సౌందర్య కూడా తన నటనతో అందంతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేసుకుంది. అంతే కాకుండా చాలా మంది గ్లామర్ షో చేస్తే సౌందర్య మాత్రం తన కెరీర్ లో ఎప్పుడూ గ్లామర్ షో చేయలేదు.
Advertisement
ఏ సినిమా లో నటించినా నటనకు ప్రాధాన్యత ఉందా తన పాత్రకు ప్రాధాన్యత ఉందా అని చూసుకుని సినిమా చేసేవారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితోనూ సౌందర్య సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ సౌందర్య వరుస సినిమాలు చేసింది. కానీ చిన్నవయసులోనే సౌందర్య బీజేపీ పార్టీ తరపున ప్రచారానికి వెళుతూ హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందింది.
Advertisement
ఈ ఘటన జరిగి ఏళ్లుగడుస్తున్నా సౌందర్య అభిమానులు మాత్రం మర్చిపోలేదు. ఇదిలా ఉంటే సౌందర్య తన కెరీర్ లో చేసిన ఒక పని మాత్రం అమె తల్లి దండ్రులకు నచ్చలేదు. సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అంటే ఆమె తల్లిదండ్రలకు ఇష్టం లేదట. ప్రతి విషయంలోనూ తల్లి దండ్రుల మాట తీయని సౌందర్య పెళ్లి విషయంలో మాత్రం అలా చేయలేదట.
తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుంటానని పట్టుపట్టిందట. సౌందర్య వరుసకు మామ అయిన వ్యక్తి రఘును ప్రేమించింది. అయితే వీరిద్దరి జాతకాలలో దోషం ఉండటం వల్ల పెళ్లికి ఒప్పుకోలేదట. అయినప్పటికీ సౌందర్య వినకుండా జాతకాలను పట్టిచుకోకుండా పెళ్లి చేసుకుందట.
ALSO READ : వారే నా భర్తను మోసం చేశారంటూ బాలాదిత్య భార్య కామెంట్స్..!